»Pm Narendra Modi Did Not Take A Single Leave In 9 Years Claims Rti Activist
PM Modi In Office: తొమ్మిదేళ్లలో ప్రధాని మోడీ ఎన్ని సెలవులు తీసుకున్నాడో తెలుసా?
పుణెకు చెందిన పౌర హక్కుల కార్యకర్త ప్రఫుల్ల శారదా ఆర్టీఐ ద్వారా ఈ సమాచారాన్ని పొందారు. 2014లో ప్రధాని నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఎన్ని రోజులు కార్యాలయానికి సెలవు పెట్టుకున్నారని ప్రఫుల్ల శారదా ఆర్టీఐ ద్వారా ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ)ను కోరారు.
PM Modi In Office: ప్రధానిగా 2014లో బాధ్యతలు చేపట్టారు నరేంద్ర మోడీ. అప్పటి నుంచి ఆయన విధులకు ఎలాంటి సెలవు తీసుకోలేదు. ఇది మాత్రమే కాదు.. గత తొమ్మిదేళ్లలో ఆయన దేశ విదేశాల్లో 3000లకు పైగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ విషయాలను పుణెకు చెందిన పౌర హక్కుల కార్యకర్త ప్రఫుల్ల శారదా ఆర్టీఐ ద్వారా ఈ సమాచారాన్ని పొందారు. 2014లో ప్రధాని నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఎన్ని రోజులు కార్యాలయానికి సెలవు పెట్టుకున్నారని ప్రఫుల్ల శారదా ఆర్టీఐ ద్వారా ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ)ను కోరారు.
దీనికి సమాధానంగా ప్రధాని నరేంద్ర మోడీ సెలవు తీసుకోకుండా నిరంతరం విధులు నిర్వహిస్తున్నారని పీఎంవో తెలిపింది. పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదు. పీఎంవో ఈ మేరకు 31 జూలై 2023న ఈ సమాధానం ఇచ్చింది. దీనికి ముందు 2015లో కూడా ఇలాగే ప్రధాని మోడీకి సంబంధించి ఆర్టీఐ ద్వారా ప్రధాని కార్యాలయం నుంచి సమాధానం కోరారు. అప్పుడు కూడా ఆయన ఇప్పటివరకు సెలవు తీసుకోలేదని తెలిపింది.
కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ 2021లో (గుజరాత్ ముఖ్యమంత్రిగా, ప్రధానిగా) 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీకి అభినందనలు తెలుపుతూ 20 ఏళ్లుగా ఒక్క సెలవు కూడా తీసుకోలేదన్నారు. అంతే కాకుండా ప్రజల కోసం నిరంతరం పని చేశారని తెలిపారు. దేశాన్ని అభివృద్ధి చేయడమే మోడీ కర్తవ్యమన్నారు. ఇన్నేళ్లలో ప్రధాని మోడీపై ఎన్ని ఆరోపణలు వస్తే అంత శక్తిమంతుడిగా మారుతున్నారని ఠాకూర్ అన్నారు.