»Nitin Gadkari Is The Only Best In Modi Government Mp Supriya
MP Supriya : మోదీ ప్రభుత్వంలో నితిన్ గడ్కరి ఒక్కరే బెస్ట్ : ఎంపీ సుప్రియా
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి (Nitin Gadkari) పై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సూప్రియా (Supriya)ప్రశంలు జల్లు కురిపించారు. కేబినెట్ లో గడ్కరి మాత్రమే పనిచేస్తున్నరని ఆమె అన్నారు. సెంట్రల్ మహారాష్ట్రలోని పర్భానీ(Parbhani) జిల్లాలో జరిగిన ఓ సమావేశంలో సూప్రియా ఈ విధంగా కామెంట్ చేశారు.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి (Nitin Gadkari) పై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సూప్రియా (Supriya)ప్రశంలు జల్లు కురిపించారు. కేబినెట్ లో గడ్కరి మాత్రమే పనిచేస్తున్నరని ఆమె అన్నారు. సెంట్రల్ మహారాష్ట్రలోని పర్భానీ(Parbhani) జిల్లాలో జరిగిన ఓ సమావేశంలో సూప్రియా ఈ విధంగా కామెంట్ చేశారు. కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న ఏకైక మంత్రి నితిన్ గడ్కరీయే. ఆ విషయాన్ని నేను రికార్డెడ్‌గా అంగీకరిస్తున్నా’’ అన్నారు. పనిచేస్తున్న సమయంలో ఇతర మంత్రుల్లా ఆయన పార్టీ అనుబంధాల గురించి ఆలోచించరంటూ ప్రశంసించారు.బిజేపి( bjp) నేతల్లో ముఖ్యంగా మహారాష్ట్రకు చెందిన వారు అబద్ధాలు చెబుతుంటారనీ.. వారికి అవార్డులు ఇవ్వాలని ఎద్దేవా చేశారు. యశ్వంత్‌రావు చవాన్ సెంటర్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె పాల్గొన్నారు. కేంద్ర మాజీ మంత్రి, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ (Sharad Pawar) కుమార్తె అయిన సుప్రియా సూలే.. మహారాష్ట్రలోని బారామతి (Baramati )నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.మోదీ చేసే తప్పిదాలను కప్పిపుచ్చుకునే పని తప్పితే ఇతర మంత్రులకు, బీజేపీ నేతలకు ఇంకే పని లేదని ఆమె ఎద్దేవా చేశారు.
మహారాష్ట్రలోని బీజేపీ నేతలు ఈ విషయంలో బాగా ఆరితేరి పోయారని, వారికి అవార్డులు ఇవ్వొచ్చని ఆమె అన్నారు. గడ్కరీ నిక్కచ్చిగా పని చేస్తున్నారని, ఆయన పని చేస్తున్నప్పుడు పార్టీ అనుబంధాల గురించి కానీ, విధానాల గురించి ఆలోచించరని, మంత్రిగా ప్రజలకు చేయాల్సిన దాని గురించి శ్రద్ధ వహిస్తారని సుప్రియా కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వంలో చాలా మంది మంత్రులకు స్వతంత్రత లేదని, అసలు పనే లేదనే విమర్శలు అనేకం వస్తుంటాయి. అయితే మోదీ మంత్రివర్గంలోని రోడ్డు-రవాణా మంత్రి నితిన్ గడ్కరికి మాత్రం ఈ విమర్శల నుంచి మినహాయింపు ఉంది. మోదీ-షాల ఆధిపత్యాన్ని దాటుకొని ఆయన ఒక్కరే పని చేస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తుంటాయి. తాజాగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత సుప్రియా సూలె సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించారు. మోదీ ప్రభుత్వంలో గడ్కరీ ఒక్కరే పని చేస్తున్నారని, దీనిపై తాను ఏ చర్చకైనా సిద్ధమంటూ ఆమె సవాల్ (challenge) విసిరారు. మోదీ చేసే తప్పిదాలను కప్పిపుచ్చుకునే పని తప్పితే ఇతర మంత్రులకు, బీజేపీ నేతలకు ఇంకే పని లేదని ఆమె ఎద్దేవా చేశారు. మహారాష్ట్రలోని బీజేపీ నేతలు ఈ విషయంలో బాగా ఆరితేరి పోయారని, వారికి అవార్డులు ఇవ్వొచ్చని ఆమె అన్నారు.
గడ్కరీ నిక్కచ్చిగా పని చేస్తున్నారని, ఆయన పని చేస్తున్నప్పుడు పార్టీ అనుబంధాల గురించి కానీ, విధానాల గురించి ఆలోచించరని, మంత్రిగా ప్రజలకు చేయాల్సిన దాని గురించి శ్రద్ధ వహిస్తారని సుప్రియా (Supriya) కొనియాడారు. ప్రధాని మోదీ PM Modiక్యాబినెట్లో 78 మంత్రులు ఉంటే, ఇందులో 31 మంది కేబినెట్ హోదాలో, తక్కిన వారు సహాయ మంత్రుల హోదాలో ఉన్నారు. ఏ శాఖకు ఎందరు మంత్రులు, సహాయ మంత్రులు ఉన్నా మోదీ కనుసన్నల్లోనే నిర్ణయాలు జరుగుతుంటాయనే ప్రచారం ఉంది. మంత్రుల పనితీరుపై ప్రధాని ఎప్పటికప్పుడు రిపోర్ట్ రాబడుతుంటారు. అవసరమని అనుకున్నప్పుడు మంత్రివర్గ పునవర్వస్థీకరణ చేస్తుంటారు. హోంమంత్రితో సహా కేంద్ర నేతలు ఎప్పుడు, ఎక్కడ ప్రసంగాలు చేసినా మోదీ ప్రస్తావన చేయని సందర్భం ఒక్కటీ కనిపించదు. ఇందుకు అనుగుణంగానే ఆయా నేతలు తగిన రివార్డులు (పదవులు) పొందుతుంటారని చెబుతుంటారు. అయితే, మోదీకి దన్నుగా నిలిచే ఇందరు మంత్రులు ఉన్నా నిబద్ధతతో పనిచేసే మంత్రులు ఒక్కరూ లేరా? సీనియర్ మంత్రి నితిన్ గడ్కరి (Nitin Gadkari) మాత్రమే పనిచేస్తు్న్నారా? అవునంటూ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) ఎంపీ సుప్రియా సూలే (Supriya Sule) తాజాగా చెప్పడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపింది.