తమిళనాడులో నిత్యానంద స్వామి(Nithyananda Swami),రంజితల వ్యవహారం చాలా హాట్ గా మారింది. ఆధ్యాత్మిక గురువు నిత్యానందతో రాసలీ లలు సాగించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి రంజిత (Actress Ranjitha) గురించి తెలిసిందే …తాజా ఇంటర్వ్యూలో రంజిత తండ్రి అశోక్ కుమార్ (Ashok Kumar) ఇదే విషయాన్ని గురించి ప్రస్తావించారు. “మాకు ముగ్గురు ఆడపిల్లలు .. నిర్మల .. రంజిత .. జ్యోతి. ముగ్గురూ కూడా బాగా చదువుకున్నారు. మంచి సంబంధాలు చూసి పెళ్లి చేశాను” అన్నారు. నిర్మల తన భర్తతో కలిసి అమెరికా(America)లో ఉండేది .. రంజితను మేజర్ జర్నల్ కి ఇచ్చాను … మూడో అమ్మాయిని ముంబైలో ఇచ్చాను. అమెరికాలో ఉన్న రంజిత అక్కయ్య నిత్యానంద భక్తురాలు .. ఆమెతో కలిసి వెళ్లిన దగ్గర నుంచి రంజిత అతని భక్తురాలైంది. అతని భ్రమలో పడిపోయి ఇద్దరూ కూడా భర్తల నుంచి విడిపోయారు.
ఈ విషయంలో నిత్యానందతో నాకు గొడవకూడా జరిగింది” అని అన్నారు. “రంజిత .. ఆమె అక్కయ్య వలన మా పరువు పోయింది. ఆ బాధను తట్టుకోలేక నా భార్య చనిపోయింది. రంజితకు తండ్రి అక్కర్లేదు .. అతని డబ్బూ అక్కర్లేదు. ఆ ఇద్దరూ నాకు కాల్ కూడా చేయరు. మొదట్లో కొంత బాధ అనిపించేది .. ఇప్పుడు అలవాటుపడిపోయాను. ఆర్ధికంగా(Financially) నాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. నా చిన్న కూతురు నన్ను బాగానే చూసుకుంటూ ఉంటుంది” అంటూ చెప్పుకొచ్చారు. నిత్యానంద వద్దకు వెళ్లిపోయారు. మోక్షం(salvation), భక్తి వల్ల మేము ఇక్కడ హ్యాపీగా ఉన్నామన్నారు. కానీ తాను వారిద్దరినీ తిట్టానని అన్నారు. ‘కోపంతో నేనోసారి నిత్యానంద దగ్గరకు వెళ్లి.. నీకు సిగ్గు అనిపించడం లేదా? నా కూతుర్ని నీ ఆశ్రమం నుంచి వెనక్కు పంపించు అని అడిగాను’ అని తెలిపారు. వారి వల్లే తన భార్య అనారోగ్యం బారిన పడిందని… ‘ నా కడుపున చెడ పుట్టారు’ అంటూ ఆసుపత్రి (hospital) లో చనిపోయిందీ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మూడో కూతురు నన్ను చూస్తుందని, తనకే మేసేజ్ చేసి .. తాము హ్యాపీగా ఉన్నామని అక్కలు చెబుతున్నారని తెలిపారు.