తెలంగాణ ప్రభుత్వం సంస్కృతి, సాంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తోందని మంత్రి తలసాని(Minister Talasani) శ్రీనివాస్ యాదవ్ అన్నారు.లాల్ దర్వాజ (Lal Darwaja) సింహ వాహిణి ఆలయాన్ని రూ. 10 కోట్లు వ్యయంతో అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ప్రకటించారు. చాంద్రాయణగుట్ట (Chandrayanagutta) నియోజకవర్గ పరిధిలోని ఉప్పుగూడలో రూ. 5 కోట్లు వ్యయంతో చేపట్టనున్న నాలుగు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్స్ (Multipurpose function halls) నిర్మాణ పనులను మంత్రి ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అత్యంత ఘనంగా బోనాల ఉత్సవాలు జరుపుతున్నామన్నారు. అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలనేది సీఎం కేసీఆర్ (CM KCR) లక్ష్యం అన్నారు. ప్రజల మధ్య విబేధాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్న పార్టీల పట్ల జాగ్రత్తగా ఉండాలని మంత్రి తలసాని సూచించారు.