లక్నోలో ఓ ఐదంతస్తుల భవనం కూలింది. శిథిలాల కింద చిక్కుకుని ముగ్గురు చనిపోయారు. మరో ముగ్గురు గాయపడ్డారు. వజీర్ హసన్ రోడ్లో గల బహుళ అంతస్తుల భవనం కూలగా, పక్కన గల భవనాలకు పగుళ్ల ఏర్పడ్డాయి. ‘భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయిందని, చనిపోయిన ముగ్గురు మృతదేహాలను పోస్టుమార్టం కోసం మార్చురీకి తీసుకెళ్లారు. గాయపడ్డవారిని చికిత్స కోసం సివిల్ ఆస్పత్రికి తరలించాం’ అని ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం బ్రజేశ్ పాఠక్ తెలిపారు.
భవనం కూలిన ప్రాంతానికి పోలీసులతోపాటు బ్రిగేడ్ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు కూడా చేరుకున్నాయి. అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనా స్థలానికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సలహాదారు అవినాష్ అవస్తి చేరుకున్నారు. ఆ భవన సముదాయంలో 15 కుటుంబాలు నివసిస్తాయిని వారు తెలిపారు. ఎస్పీ నేత షాహిద్ మంజూర్ కుటుంబం కూడా అందులోనే ఉంటుందని వివరించారు.