ఓ వ్యక్తికి కన్న తండ్రి దగ్గరుండి.. శ్రీ కృష్ణుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజంగా జరిగిన యదార్థ గాథ. ఒకప్పుడు మీరబాయి లాంటివారు కృష్ణుడిని పెళ్లాడు అని మీరు పురాణాల్లో విని ఉంటారు. నిజ జీవితంలో.. అది కూడా ఈ కాలంలో ఇలాంటి సంఘటన జరగడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. ఈ సంఘటన మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకోగా… ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన ఓ యువతి శ్రీకృష్ణుడిని పెళ్లాడింది. ఆమె దివ్యాంగురాలు కావడం గమనార్హం. అయితే… ఆమె దివ్యాంగురాలు అని.. ఆమెను వివాహం చేసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఈ క్రమంలో కూతురు బాధ చూడలేక.. ఆమె తండ్రి ఈ నిర్ణయం తీసుకున్నాడు. తన కూతురికి కృష్ణుడిని ఇచ్చి అంగరంగవైభవంగా పెళ్లి జరిపించాడు. ఆలయంలో ఓ అమ్మాయికి కృష్ణుడి వేషం కట్టించి సంప్రదాయబద్ధంగా తంతు జరిపించాడు.
శివపాల్ రాథోడ్ అనే వ్యాపారి కూతురు సోనాల్ మూగ, చెవిటి. నవడలేదు కూడా. మంచానికే పరిమితమైన ఆమెకు ఎవరో ఒకరు దొరికితే పెళ్లిచేయాలని ఆయన ఎంతో ఆశపడ్డాడు. అయితే ఏ యువకుడూ ముందుకు రాలేదు. కూతురి బాధ, బంధువులు సూటిపోటి మాటలతో శివపాల్ ఎంతో మనోవేదన పడ్డాడు. ఊరికే బాధపడుతూ కూర్చుంటే సరిపోదని, తన కూతురి పెళ్లిని దేశమంతా ఘనంగా చెప్పుకోవాలని ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకన్నాడు.
తన కూతురి పెళ్లి నిశ్చయమైందని, అందరూ రావాలని బంధుమిత్రులకు ఫోన్లు చేశాడు. వరుడు ఎవరి వారు ఆరా తీయగా శ్రీకృష్ణుడని చెప్పడంతో అవాక్కయ్యారు. కూతురిపై అతని ప్రేమను మెచ్చుకుని పెళ్లికి హాజరయ్యారు. పెళ్లిని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. మెహందీ, ఊరేగింపు నిర్వహించిన మంచి భోజనం పెట్టారు. ఇక తన కూతురి భారమంతా అ కృష్ణభగవానుడిదేనని శివపాల్ చెప్పారు.