Mallu Ravi: కాంగ్రెస్ నేత మల్లు రవి కీలక వ్యాఖ్యలు చేశారు. కరెన్సీ నోట్లపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఫొటో ముద్రించాలని డిమాండ్ చేశారు. దీని సందర్భంగా ఢిల్లీ జంతర్‌మంతర్‌లో అంబేద్కర్ ఫొటో సాధన సమితి నిన్న ధర్నా నిర్వహించింది. సమితి అధ్యక్షుడు జరిపోతుల పరశురామ్ ఆధ్వర్యంలో ఈ దర్నా జరిగింది.
ఈ నిరసనలో ఎంపీ ఆర్.కృష్ణయ్య, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లురవి, సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ, తెలంగాణ ఓబీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లు రవి మాట్లాడుతూ కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫొటో ముద్రించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటుకు మూల కారణం అంబేద్కరేనని వ్యాఖ్యానించారు. అందుకే ఆయన ఫొటోను కరెన్సీపై ముంద్రించాలని కోరారు.