»Usa A Key Commander Supported By Iran Was Killed In The Us Attack
USA: అమెరికా దాడిలో ఇరాన్ మద్దతున్న కీలక కమాండర్ మృతి
జోర్డాన్‌లో ఇటీవల ముగ్గురు అమెరికా సైనికుల మరణానికి ప్రతీకారంగా దాడి చేసింది. ఇరాక్‌లోని మిలిటెంట్ల స్థావరాలపై నిన్న వైమానిక దాడులు జరిగాయి. ఇందులో ఇరాన్ మద్దతున్న ఓ కీలక కమాండర్ హతమైనట్లు అమెరికా సైన్యం ప్రకటించింది.
USA: జోర్డాన్‌లో ఇటీవల ముగ్గురు అమెరికా సైనికుల మరణానికి ప్రతీకారంగా దాడి చేసింది. ఇరాక్‌లోని మిలిటెంట్ల స్థావరాలపై నిన్న వైమానిక దాడులు జరిగాయి. ఇందులో ఇరాన్ మద్దతున్న ఓ కీలక కమాండర్ హతమైనట్లు అమెరికా సైన్యం ప్రకటించింది. మధ్యప్రాచ్యంలోని అగ్రరాజ్య స్థావరాలపై జరుగుతున్న దాడుల్లో అతని హస్తం ఉందని తెలిపింది. ఇరాన్ మద్దతున్న కేతబ్ హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూప్ మరికొన్ని సంస్థలతో కలిసి మధ్యప్రాచ్యంలోని తమ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుందని అమెరికా తెలిపింది. అందులో భాగంగా ఇటీవల జోర్డాన్‌లో దాడి జరిగినట్లు గుర్తు చేసింది.
వాటికి ప్రతీకారంగా ఇరాక్, సిరియాల్లో ఇరాన్ మద్దతుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మిలిటెంట్ గ్రూప్‌లపై దాడులు చేస్తున్నట్లు వివరించింది. ఈక్రమంలో బుధవారం కేతబ్ హెజ్బొల్లాకు చెందిన కీలక కమాండర్ అబూ బకర్ అల్-సాదిని మట్టుబెట్టామని తెలిపింది. దీన్ని ఆ సంస్థతో పాటు ఇరాక్ ఇంటీరియర్ మంత్రిత్వశాఖ అధికారి కూడా తెలిపారు. అయితే స్వయం ప్రకటిత పారామిలిటరీ గ్రూప్‌ల సంకీర్ణం హషెద్ అల్-షాబీ అమెరికా చర్యలను ఖండించింది.
శుక్రవారం అగ్రరాజ్యం జరిపిన దాడిలో 16 మంది తమ ఫైటర్లు మరణించినట్లు తెలిపింది. అలాగే మరో 36 మంది గాయపడ్డారని తెలిపింది. అమెరికా దళాలు సిరియాలో చేసిన దాడుల్లో ఇరాన్‌కు మద్దతుగా పోరాడుతున్న 29 మంది మరణించారని మానవహక్కుల సంస్థ తెలిపింది. ఉగ్రసంస్థ ఐసిస్‌పై పోరాటంలో భాగంగా ప్రస్తుతం ఇరాక్‌లో 2500, సిరియాలో 900 మంది సైనికులను అమెరికా మోహరించింది.