»Liquor Ban In India Doctor Demands From Supreme Court Where Liquor Is Ban In India
Supreme Court: వాళ్లు తప్పతాగుతున్నారంటే.. దానికి రాష్ట్ర ప్రభుత్వానిది బాధ్యత కాదు
యువకులు మద్యం సేవించకుండా ఆదేశాలు జారీ చేయాలని డాక్టర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. యువకులు అతిగా మద్యం సేవిస్తున్నారనేది వైద్యుల వాదన. దీంతో కోర్టు కూడా ఆశ్చర్యపోయింది.
Supreme Court: యువత అతిగా మద్యం సేవిస్తే అది వారి ఇష్టం దాన్ని నియంత్రించడం రాష్ట్రప్రభుత్వం కర్తవ్యం కాదని ఓ వైద్యుడి పిటిషన్ పై ప్రభుత్వం తెలిపింది. దేశవ్యాప్తంగా మద్యాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు. యువకులు మద్యం సేవించకుండా ఆదేశాలు జారీ చేయాలని డాక్టర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. యువకులు అతిగా మద్యం సేవిస్తున్నారనేది వైద్యుల వాదన. దీంతో కోర్టు కూడా ఆశ్చర్యపోయింది.
సుప్రీం కోర్టులో జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించడానికి నిరాకరించింది. మద్యం అమ్మకాలను నిషేధించాలని ఆదేశించడం వల్ల ఇది మరిన్ని సమస్యలకు దారితీయవచ్చు. యువకులు అతిగా మద్యం సేవిస్తున్నారని పిటిషనర్ డాక్టర్ తరుపున తెలిపారు. మద్య నిషేదం వల్ల ప్రజలపై రాష్ట్రానికి మరింత నియంత్రణ లభిస్తుందని వారి వాదన. భారతదేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో మద్యపానంపై వివిధ ఆంక్షలు ఉన్నాయి. బీహార్, గుజరాత్, మిజోరాం, నాగాలాండ్ రాష్ట్రాలు మద్యం వినియోగం, అమ్మకాలను పూర్తిగా నిషేధించాయి.
భారతదేశంలోని ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మద్యం వినియోగం, అమ్మకాలను అనుమతిస్తాయి. అయితే వాటికి నిబంధనలు ఉన్నాయి. జాతీయ సెలవులు లేదా ఎన్నికల సమయంలో మద్యం అమ్మకాలను అనుమతించరు. అవే కాకుండా చాలా రాష్ట్రాల్లో డ్రై డే జరుపుకుంటారు. చట్టపరమైన మద్యపాన వయస్సు కూడా రాష్ట్రాల నుండి రాష్ట్రాలకు మారుతూ ఉంటుంది. ఇది 18 నుండి 25 సంవత్సరాల వరకు ఉంటుంది. అయితే, ఈ పరిమితులు ఉన్నప్పటికీ భారతదేశంలో మద్యం వినియోగం నిరంతరం పెరుగుతూనే ఉంది.