ఢిల్లీ లిక్కర్ స్కాం లో భాగంగా సీబీఐ అధికారులు కవితను విచారించనున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఎంపీ కోమటిరెడ్డి, వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ లాంటి వాళ్లనే సీబీఐ అధికారులు ఆఫీసుకు పిలిచి మరీ విచారణ జరిపించి… కవితను మాత్రం ఎందుకు ఇంటికి వచ్చి మరీ విచారిస్తున్నారు అని ప్రశ్నించారు. కవితకు మాత్రమే ఆ మినహాయింపు ఎందుకు అని ఆయన ప్రశ్నించడం గమనార్హం. బీజేపీ, టీఆర్ఎస్ కుమ్మక్కయ్యిందని.. అందుకే కవితను ఇంటికి వచ్చి మరీ విచారిస్తున్నారని ఆయన విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీని ఖతం చేసేందుకే బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు కలిసి పన్నాగం పన్నాయని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపణలు చేశారు.టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణలో విద్య చాలా ఖరీదైందన్నారు. ఎంతో మంది విద్యార్థులు తన వద్దకు సహాయం కోసం వస్తున్నారని తెలిపారు వెంకట్ రెడ్డి. కేవలం నాలుగు ఫ్లైఓవర్లు, రెండు రోడ్లు వేసినంత మాత్రాన అభివృద్ధి అయిపోయిందని చెప్పారని విమర్శించారు.
గెలిచిన ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకుని.. అదే తమ బలంగా టీఆర్ఎస్ భావిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే కార్యకర్తలు కోరుకున్న అభ్యర్థికే టికెట్ దక్కుతుందని ఆరోపించారు. కాంగ్రెస్ అధిష్టానం కూడా కార్యకర్తల అభీష్టం మేరకు అభ్యర్థులకు టికెట్ ఇవ్వాలని చూస్తోందన్నారు. కొందరు నాయకులు రాజ్యాంగాన్ని మార్చాలని అంటున్నారు.