»Kerala Based Collector Opened On The Molestation She Faced
Molestation: నన్ను ఇద్దరు లైంగికంగా వేధించారు: కేరళ కలెక్టర్
తనకు ఆరేళ్ల వయస్సు ఉన్నప్పుడు ఇద్దరు వ్యక్తులు తనను లైంగికంగా వేధించారని కేరళ రాష్ట్రానికి (Kerala) చెందిన ఓ ఐఏఎస్ అధికారిణి (IAS officer) వెల్లడించారు.
తనకు ఆరేళ్ల వయస్సు ఉన్నప్పుడు ఇద్దరు వ్యక్తులు తనను లైంగికంగా వేధించారని కేరళ రాష్ట్రానికి (Kerala) చెందిన ఓ ఐఏఎస్ అధికారిణి (IAS officer) వెల్లడించారు. డాక్టర్ దివ్య ఎస్ అయ్యర్ కేరళలోని పథనంతిట్ట జిల్లా కలెక్టర్ గా (Pathanamthitta District Collector Dr Divya S Iyer) ఉన్నారు. మంగళవారం చైల్డ్ వెల్ఫేర్ డిపార్టుమెంట్ (Child Welfare Department) ఆధ్వర్యంలో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఆమె (Collector Dr Divya S Iyer) మాట్లాడారు. తనకు ఆరేళ్ల వయస్సు ఉన్నప్పుడు ఇద్దరు వ్యక్తులు వచ్చి తన పక్కన కూర్చొని, ఆప్యాయంగా పలకరించారని, తనను టచ్ చేశారని, ఆ సమయంలో వారు ఎందుకు ముట్టుకుంటున్నారో, ఎందుకు అంత ప్రేమ చూపిస్తున్నారో తనకు అర్థం కాలేదని చెప్పారు. ఆ తర్వాత వాళ్లు తన దుస్తులు విప్పినప్పుడు బాధగా అనిపించిందని, దీంతో తాను అక్కడి నుండి పారిపోయానని చెప్పారు. తన తల్లిదండ్రుల సహకారంతో తాను ఆ బాధ నుండి తప్పించుకున్నట్లు చెప్పారు. ఆ తర్వాత వారు ఎక్కడైనా కనిపిస్తారేమోనని చూశానని, కానీ ఎక్కడా కనిపించలేదన్నారు. వారి ముఖాలు మాత్రం తనకు ఇప్పటికీ గుర్తుకు ఉన్నాయని తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నారు.
ఈ సందర్భంగా ఎవరు ఎలా మనతో మాట్లాడుతున్నారు… మనల్ని టచ్ చేసే వారు సదభిప్రాయంతో ఉన్నారా లేక దురభిప్రాయంతో ఉన్నారా అనే విషయం పట్ల పిల్లలకు అవగాహన కల్పించాలని ఆమె పిలుపునిచ్చారు. ఇలాంటి అనుభవాలు పిల్లలకు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తనకు చేదు అనుభవం ఎదురైనప్పుడు తన తల్లిదండ్రుల మద్దతు లభించిందని, తట్టుకునే సామర్థ్యాన్ని ఇచ్చారన్నారు. పిల్లలందరికీ ఒకే తరహా మద్దతు లభించదని గుర్తు చేశారు. తిరువనంతపురంకు చెందిన దివ్య ఎస్ అయ్యర్ మెడికల్ డాక్టర్ కూడా. ఈ ఏడాది ప్రారంభంలో ఎక్సలెన్స్ ఇన్ గుడ్ గవర్నెన్స్ అవార్డును (Excellence in Good Governance Award) కూడా అందుకున్నారు. ఈమె భర్త అరవిక్కర మాజీ ఎమ్మెల్యే కేఎస్ శబరినాధన్ (former Aruvikkara MLA, KS Sabarinadhan).