కర్నాటక రాష్ట్రం బళ్ళారి సిటీ కార్పోరేషన్ మేయర్ గా (Ballari city corporation Mayor) 23 సంవత్సరాల త్రివేణి సూరి (Triveni Suri) బాధ్యతలు చేపడుతున్నారు. నాలుగో వార్డు కాంగ్రెస్ కార్పోరేటర్ గా (Corporator) ఉన్న ఆమె... బుధవారం మేయర్ పీఠానికి జరిగిన ఓటింగ్ లో (Mayor Voting) విజయం సాధించారు.
కర్నాటక రాష్ట్రం బళ్ళారి సిటీ కార్పోరేషన్ మేయర్ గా (Ballari city corporation Mayor) 23 సంవత్సరాల త్రివేణి సూరి (Triveni Suri) బాధ్యతలు చేపడుతున్నారు. నాలుగో వార్డు కాంగ్రెస్ కార్పోరేటర్ గా (Corporator) ఉన్న ఆమె… బుధవారం మేయర్ పీఠానికి జరిగిన ఓటింగ్ లో (Mayor Voting) విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీకే (Congress Party) చెందిన జానకమ్మను డిప్యూటీ మేయర్ గా (Deputy Mayor) ఎన్నుకున్నారు. మేయర్ గా (Mayor) బాధ్యతలు చేపట్టనున్న త్రివేణి కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పోరేటర్. ఆమె ఏడాది పాటు మేయర్ పదవిలో కొనసాగుతారు. ఆమె 18 సంవత్సరాలకే ప్రత్యక్ష రాజకీయాల్లోకి (Politics) అడుగు పెట్టారు. 21 ఏళ్లకు కార్పోరేటర్ గా గెలిచారు. ఆమె పారామెడికల్ డిగ్రీ హోల్డర్. ఇప్పుడు ఈమె 23 ఏళ్లకే మేయర్ అయ్యారు. మైసూరు సిటీ కార్పోరేషన్ (Mysuru City Corporation) మేయర్ (Mayor) తస్నీమ్ బానో 31 ఏళ్లకు మేయర్ అయ్యారు. ఈ కుటుంబం నుండి ఈ పదవి చేపడుతున్న రెండో వ్యక్తి త్రివేణి. ఆమె తల్లి సుశీలాబాయి కూడా 2018లో ఏడాది పాటు మేయర్ గా పని చేశారు.
బళ్లారి సిటీ కార్పోరేషన్ లో ((Ballari city corporation Mayor) 39 మంది కార్పోరేటర్లు ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలు కూడా ఓటింగ్ లో పాల్గొంటారు. వీరితో కలిపి మొత్తం 44 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు. ఇందులో త్రివేణికి 28 ఓట్లు రాగా, ప్రత్యర్థి బీజేపీకి చెందిన నాగరత్నమ్మకు 16 ఓట్లు వచ్చాయి. బీజేపీకి (BJP) ఇక్కడ 13 మంది కార్పోరేటర్లు ఉన్నారు. మేయర్ పదవిని (Mayor Post) దక్కించుకోవడానికి బీజేపీ (BJP) అన్ని ప్రయత్నాలు చేసింది. ఇండిపెండెంట్ కార్పోరేటర్లు ఉండటంతో వారి ద్వారా గెలిచే ప్రయత్నం చేసింది. కానీ ఐదుగురు స్వతంత్ర కార్పోరేటర్లు కాంగ్రెస్ వైపు (Congress Party) మొగ్గు చూపారు. ఆ పార్టీకి 21 మంది కార్పోరేటర్లు ఉన్నారు. కాంగ్రెస్ నుండి మేయర్ పదవికి ముగ్గురు పోటీ పడ్డారు.