»Three Cornered Fight In Karnataka Assembly Election
Karnataka assembly election 2023: రెండోసారి బీజేపీ వస్తుందా, కాంగ్రెస్ గెలుస్తుందా?
కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు (Karnataka Election Date 2023) షెడ్యూల్ ఖరారైంది. బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) ఈ రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించింది.
కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు (Karnataka Election Date 2023) షెడ్యూల్ ఖరారైంది. బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) ఈ రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించింది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు (Karnataka Assembly Elections) ఒకే దశలో ఎన్నికలు నిర్వహించనున్నారు. మే 10వ తేదీన పోలింగ్ జరగనుంది. మే 13వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడిస్తారు. నేటి నుండి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. కర్నాటకలో 5.21 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 2.62 కోట్ల మంది పురుషులు, 2.59 కోట్ల మంది మహిళలు ఉన్నారు. మే 24, 2023తో కర్నాటక అసెంబ్లీ గడువు ముగియనుంది. ఈ ఎన్నికల్లో తొలిసారిగా వృద్ధులకు ఓట్ ఫ్రమ్ హోమ్ (EC introduces Vote From Home for senior citizens and PwD voters) వెసులుబాటును కల్పించింది ఎన్నికల సంఘం (election commission of india). 80 ఏళ్లకు పైబడిన వృద్ధులు, అంగవైకల్యంతో బాధపడుతున్న వారు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. ఎన్నికల నగారా నేపథ్యంలో కర్నాటకలో (Karnataka polls) బీజేపీ రెండోసారి వస్తుందా? లేక కాంగ్రెస్ గెలుస్తుందా? హంగ్ ఏర్పడి జేడీఎస్ కింగ్ మేకర్ అవుతుందా అనే చర్చ సాగుతోంది.
బీజేపీ టార్గెట్ 150
224 అసెంబ్లీ స్థానాలు (224 Assembly seats in Karantaka) ఉన్న కర్నాటకలో బీజేపీకి (BJP) 119 మంది, కాంగ్రెస్ కు (Congress) 75 మంది, జేడీఎస్ కు (JDS) 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీ ఈసారి 150 సీట్లను టార్గెట్ గా పెట్టుకున్నది. ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై సారథ్యంలో ఎన్నికలు జరగనున్నాయి. మాజీ సీఎం, లింగాయత్ కీలక నేత బీఎస్ యెడ్యూరప్ప 2024లోను మోడీని మూడోసారి ప్రధాని చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. యెడ్యూరప్ప జూలై 2021 వరకు సీఎంగా ఉన్నారు. ఆ తర్వాత బొమ్మై సీఎం అయ్యారు. ఈసారి యెడ్డీ పోటీ చేసే అవకాశాలు తక్కువ. ఆయన తనయుడు విజయేంద్ర శిఖారిపుర నియోజకవర్గం నుండి పోటీ చేయవచ్చునని భావిస్తున్నారు. అలాగే, బాగా పని చేయని ఎమ్మెల్యేలకు బీజేపీ టిక్కెట్ నిరాకరించే అవకాశం ఉంది. నరేంద్ర మోడీ ఫేస్ ను ఈ ఎన్నికల్లోను ఉపయోగించుకోనున్నారు. ఇటీవల 4 శాతం ముస్లీం రిజర్వేషన్ ను తొలగించి వొక్కలింగ, లింగాయత్ లకు కేటాయించింది బీజేపీ. ఇది ఈ పార్టీకి ప్రయోజనం చేకూర్చే అవకాశాలు ఉన్నాయి.
రిజర్వేషన్ పునరుద్ధరిస్తామని కాంగ్రెస్
ముస్లీంలకు తొలగించిన నాలుగు శాతం రిజర్వేషన్ ను తాము అధికారంలోకి వస్తే పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ మైనార్టీ ఓట్లను ఆకర్షించే ప్రయత్నాలు అప్పుడే ప్రారంభించింది. మాజీ సీఎం సిద్ధరామయ్యను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఫోకస్ చేస్తున్నారు. కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షులు డీకే శివకుమార్ కు కూడా ప్రాధాన్యత ఇస్తోంది పార్టీ. చాలా రాష్ట్రాల్లో బీజేపీ దరిదాపుల్లోకి రాలేకపోతోంది కాంగ్రెస్. కానీ కర్నాటకలో మాత్రం టఫ్ పైట్ ఇస్తోంది.
జేడీఎస్ కింగ్ మేకర్ ఆశలు
జేడీఎస్ మరోసారి కింగ్ మేకర్ లేదా కింగ్ ఆశలు పెట్టుకున్నది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు మెజార్టీ రాకుంటే జేడీఎస్ కు డిమాండ్ పెరుగుతుంది. పాత మైసురు ప్రాంతంతో పాటు ఇతర ప్రాంతాల్లోను విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.