PM Modi: దేశమంతా లోక్ సభ ఎన్నికల హడావిడీ సాగుతున్న సమయంలో బీజేపీ ఎంపీ మరణించడం బాధాకరమని పీఎం నరేంద్ర మోడీ పేర్కొన్నారు. సీనియర్ బీజేపీ నేత, ఎంపీ వి. శ్రీనివాస ప్రసాద్ ఆనారోగ్యంతో మరణించారు. కర్ణాటక రాష్ట్రంలోని చామరాజనగర్ ఎంపీగా ఉన్న శ్రీనివాస్ ప్రసాద్(76) గత కొంత కాలంగా ఆనారోగ్య సమస్యలతో సతమతమౌతున్నారు. రాజకీయాలకు ఆయన ఆరోగ్యం సహకరించపోవడంతో ఈ సంవత్సరం మార్చి 18న రాజకీయాలకు తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇంతలో ఆరోగ్యం క్షీణించడంతో గత నాలుగు రోజులుగా బెంగళూరులోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఈ రోజు తుదిశ్వాస విడిచారు.
మాజీ మంత్రి, ప్రస్తుత ఎంపీ వి. శ్రీనివాస ప్రసాద్ మృతికి ప్రధాని నరేంద్రమోదీ సంతాపం వెల్లడించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. శ్రీనివాస ప్రసాద్‌కు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది. 1976లోనే జనతా పార్టీలో చేరారు. యాక్టీవ్ పాలిటిక్స్ చేసే ఆయన ఆ తరువాత 1979లో కాంగ్రెస్‌లో చేరారు. ఆ తరువాత కర్ణాటక ప్రాంతీయ పార్టీలు అయిన జేడీఎస్, జేడీయూ, సమతా పార్టీలోనూ ఆయన పనిచేశారు. ఆ తరువాత బీజేపీలో చేశారు. 2017లో నంజన్‌గుడ్ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. కానీ తక్కువు ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. 2019లో చామరాజనగర్ నుంచి ఎంపీగా గెలుపొందారు.