»Arvind Kejriwal Wife Denied Permission To See Husband
Arvind Kejriwal: భర్తను చూసేందుకు భార్యకు అనుమతి నిరాకరణ!
ఢిల్లీ మద్యం కేసులో అరెస్టు అయి తిహార్ జైల్లో జ్యూడిషియల్ కస్టడీలో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను కలవడానికి అతని భార్య సునీతకు జైలు అధికారులు అనుమతి ఇవ్వలేదు.
Arvind Kejriwal: Wife denied permission to see husband!
Arvind Kejriwal: ఢిల్లీ మద్యం కేసులో అరెస్టు అయిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం తిహార్ జైల్లో జ్యూడిషియల్ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈరోజు కేజ్రీవాల్‌ను కలిసి మాట్లాడేందుకు అతని భార్య సునీత అనుమతి కోరారు. అయితే దీనికి అధికారులు అంగీకరించలేదని ఆమ్ ఆద్మీ పార్టీ తెలిపింది. ఆప్ నేత ఆతిశీకి అనుమతి ఇవ్వడం వల్ల సునీత అభ్యర్థనను తిరస్కరించామని జైలు అధికారులు తెలిపారు. ఈరోజు ఢిల్లీ మంత్రి ఆతిశీ కేజ్రీవాల్‌తో మాట్లాడనున్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ రేపు కేజ్రీవాల్‌ను కలవనున్నారు. సునీతకు తర్వాత అనుమతి ఇవ్వనున్నట్లు జైలు అధికారులు చెబుతున్నారు.
నిబంధనల ప్రకారం వారంలో రెండుసార్లు మాత్రమే ములాఖత్‌కు అనుమతి ఉంది. అయితే భర్తను చూసేందుకు సునీతకు వచ్చే వారమే అనుమతి లభించనుంది. అయితే జైల్లో ఉన్న వ్యక్తితో ఒకేసారి ఇద్దరు వ్యక్తులు మాట్లాడే వీలుందని, కానీ జైలు అధికారులు సునీతను అనుమతించడం లేదని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇటీవల భగవంత్ మాన్ కేజ్రీవాల్‌ను కలిసినప్పుడు పంజాబ్ సీఎం వెంట ఆప్ జనరల్ సెక్రటరీ సందీప్ పాథక్ కూడా ఉన్నట్లు తెలిపారు. కావాలనే జైలు అధికారులు సునీతను అనుమతించడం లేదన్నారు.