»Kamal Haasan Questioned To Pm Modi On Parliament Building Inauguration
New Parliament Building ప్రధాని మోదీని నిలదీసిన హీరో కమల్ హాసన్
జాతీయ ప్రయోజనాల దృష్య్టా నేను కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని సంబరంగా చేసుకుంటా. అయితే రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడం, ప్రారంభోత్సవ షెడ్యూల్ లో ప్రతిపక్ష పార్టీలను చేర్చకపోవడంపై నా అసమ్మతిని కొనసాగిస్తా’
కొత్త పార్లమెంట్ భవనం (New Parliament Building) ప్రారంభోత్సవంపై వివాదం కొనసాగుతూనే ఉన్నది. ఈ అంశం న్యాయస్థానం వరకు కూడా వెళ్లింది. కానీ ఆ పిటిషన్ తిరస్కరణకు గురయ్యింది. ఇక ఈ భవనం ప్రారంభోత్సవంపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే అసలు రాష్ట్రపతి (President of India), ప్రధానమంత్రి పదవుల బాధ్యతలు ఏమిటి? ఎవరు ఏం చేయాలి? అనే ప్రశ్నలు మొదలవుతున్నాయి. రాష్ట్రపతితో ప్రారంభించకుండా ప్రధాని చేయనుండడం ఈ వివాదానికి బీజం వేసింది. తాజాగా ఇదే విషయాన్ని ప్రముఖ నటుడు, తమిళనాడు రాజకీయ నాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) డిమాండ్ చేశారు. తనకు ప్రధాని మోదీ సమాధానం (Answer) చెప్పాలని సవాల్ విసిరారు.
కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవంపై మక్కల్ నీది మయ్యం (Makkal Needhi Maiam) పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నేను ప్రధానిని ఓ ప్రశ్న (Question) అడుగుతాను. దయచేసిన సమాధానం చెప్పాలి. మన కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ఎందుకు హాజరుకాకూడదు?’ అని ప్రశ్నించారు. ‘దేశానికి అధినేతగా ఉన్న రాష్ట్రపతి ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో పాల్గొనకపోవడానికి కారణం నాకు కనిపించడం లేదు’ అని పేర్కొన్నారు. ‘జాతీయ ప్రయోజనాల దృష్య్టా నేను కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని (Inaugaration) సంబరంగా చేసుకుంటా. అయితే రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడం, ప్రారంభోత్సవ షెడ్యూల్ లో ప్రతిపక్ష పార్టీలను చేర్చకపోవడంపై నా అసమ్మతిని కొనసాగిస్తా’ అని కమల్ హాసన్ ప్రకటించారు.
కాగా, కమల్ హాసన్ కూడా ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. మోదీ సాగిస్తున్న నియంతృత్వ ధోరణికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలతో (Oppositions) కలిసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఇటీవల కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) ప్రమాణస్వీకారానికి కూడా కమల్ హాజరయ్యారు. విపక్ష పార్టీలతో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.