»Isro Chandrayaan 3 Sleeping On The Moon Photos Shared By Isro
ISRO: జాబిల్లిపై నిద్రపోతున్న చంద్రయాన్3.. ఫోటోలు షేర్ చేసిన ఇస్రో
భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్3 ఫోటోలను చంద్రయాన్2 తీసింది. ఈ సందర్భంగా జాబిల్లిపై ఉన్న చంద్రయాన్3 ల్యాండర్ ఫోటోలను ఇస్రో సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసింది.
జాబిల్లిపై చంద్రయాన్3 ల్యాండర్ స్లీపింగ్ మోడ్ లోకి వెళ్లింది. తాజాగా చంద్రయాన్3కి సంబంధించిన ఫోటోలను చంద్రయాన్2 ఆర్బిటర్ ఫోటోలు తీసి పంపింది. ఈ ఫోటోలను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఆర్బిటర్ లోని డ్యుయల్ ఫ్రీక్వెన్సీ సింథటిక్ అపర్చర్ రాడార్ పరికరం సెప్టెంబర్ 6వ తేదిన ఫోటోలు తీసినట్లు తెలిపింది.
చంద్రయాన్2 తీసిన ఫొటోలను ఇస్రో తన ట్విటర్ ఖాతాతో పాటు వెబ్సైట్లో పోస్ట్ చేయడంతో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సౌర శక్తి వెలుగు లేకున్నా రాడార్ వల్ల ఫొటోలు తీయొచ్చని ఈ సందర్భంగా ఇస్రో వెల్లడించింది. ఇప్పటికే జాబిల్లిపై ల్యాండర్, రోవర్ కు సంబంధించిన పలు ఫొటోలను ఇస్రో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఆదిత్య ఎల్-1 కూడా భూమితో పాటు చంద్రుని ఫోటోలను తీసి ఇస్రోకు పంపించింది. సూర్యుడి రహస్యాలను ఛేదించేందుకు ఇస్రో ఈమధ్యనే ఆదిత్య ఎల్-1 ప్రయోగం చేపట్టిన సంగతి తెలిసిందే.
ఇస్రో షేర్ చేసిన చంద్రయాన్3 ఫోటోలు:
Chandrayaan-3 Mission: Here is an image of the Chandrayaan-3 Lander taken by the Dual-frequency Synthetic Aperture Radar (DFSAR) instrument onboard the Chandrayaan-2 Orbiter on September 6, 2023.