I-T teams at BBC offices:ముంబై, ఢిల్లీ బీబీసీ కార్యాలయాల్లో ఐటీ టీమ్ సర్వే, కారణమిదే?
I-T teams at BBC offices:బీబీసీ ఆఫీసుల్లో (bbc office) ఆదాయపన్ను (income tax) శాఖ అధికారుల బృందాలు సోమవారం సర్వే చేపట్టాయి. ముంబై (mumbai), ఢిల్లీలో (delhi) గల కార్యాలయాలకు ఈ రోజు ఉదయం చేరుకున్నాయి. కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల మొబైళ్లను (mobiles) స్వాధీనం చేసుకున్నారు. తర్వాత కార్యాలయాన్ని వదిలి వెళ్లిపోవాలని ఉద్యోగులను కోరినట్టు తెలిసింది.
I-T teams at BBC offices:బీబీసీ ఆఫీసుల్లో (bbc office) ఆదాయపన్ను (income tax) శాఖ అధికారుల బృందాలు సోమవారం సర్వే చేపట్టాయి. ముంబై (mumbai), ఢిల్లీలో (delhi) గల కార్యాలయాలకు ఈ రోజు ఉదయం చేరుకున్నాయి. కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల మొబైళ్లను (mobiles) స్వాధీనం చేసుకున్నారు. తర్వాత కార్యాలయాన్ని వదిలి వెళ్లిపోవాలని ఉద్యోగులను కోరినట్టు తెలిసింది. మధ్యాహ్నం షిఫ్ట్ చేసే బీబీసీ ఉద్యోగులను ఇంటి నుంచి పని చేసుకోవాలని కోరినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. బీబీసీ కార్యాలయాల్లో ఐటీ అధికారుల సర్వే సమాచారంపై కాంగ్రెస్ (congress) సహా విపక్షాలు స్పందించాయి. అదానీ (adani) అంశంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేయాలని డిమాండ్ చేస్తుంటే, ప్రభుత్వం బీబీసీ వెంట పడుతోందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది.
జీ-20 (g-20) దేశాలకు నాయకత్వం వహిస్తున్న ఈ సమయంలో దేశం నిరంకుశ్వం, నియంతృత్వంలోకి వెళ్లిందని ప్రధాని మోడీ (modi) నిరూపిస్తున్నారు. బీబీసీపై (bbc) దాడులు, అదానీకి (adani) క్లిన్ చిట్, సంపన్నులకు పన్ను తగ్గింపులు అని కాంగ్రెస్ పార్టీ నేత గౌరవ్ గొగోయ్ (gaurav gogoi) విమర్శించారు. ఇదీ నిజమా? ఊహించ లేదని టీఎంసీ నేత మహువా మోయిత్రా (mahua moitra) ట్వీట్ చేశారు. పన్ను చెల్లింపుదారుల వాస్తవ ఆదాయం వివరాలను తేల్చేందుకు ఐటీ అధికారులు (it officials) సర్వే (survey) నిర్వహిస్తుంటారు.
అంతర్జాతీయ పన్ను, నగదు బదిలీకి సంబంధించి అక్రమాలు జరిగాయని, అందుకే ఐటీ అధికారులు (it officials) కార్యాలయాల్లోకి వచ్చినట్టు తెలిసింది. బీబీసీకి వ్యాపార కార్యకలాపాలకు చెందిన పత్రాలు, భారత దేశానికి చెందిన డాక్యుమెంట్లను (documents) ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారని పీటీఐ వార్తా సంస్థకు ఓ అధికారి తెలిపారు.
यहां हम अडानी के मामले में JPC की मांग कर रहे हैं और वहां सरकार BBC के पीछे पड़ी हुई है।
సర్వేలో భాగంగా ఐటీ అధికారులు కార్యాలయ పరిసరాలను తనిఖీ చేసే అధికారం ఉంటుంది. ఆ సంస్థ ప్రమోటర్లు (promotors), డైరెక్టర్లు (directors) నివాసాలు.. ఇతర చోట్ల రైడ్ చేసే అధికారం ఉండదు. ఢిల్లీలో ఉర్దూ విభాగానికి సంబంధించి ఇద్దరు ఉన్నట్టు తెలిసింది. బీబీసీకి (bbc) ముంబైలో (mumbai) బాంద్రా కుర్లాలో ఒకటి, ఖార్ వద్ద మరో ఆపీసు ఉంది. అధికారులు ప్రస్తుతం బాంద్రా వద్ద ఉన్నారు. ఖార్ ఆఫీసులో పనిచేసే ఉద్యోగులను ఇంటికి పంపించారు. 2002 గుజరాత్ అల్లర్లకు (gujarat riots) సంబంధించి బీబీసీ డాక్యుమెంటరీ తీసి, రెండు పార్టులుగా టెలికాస్ట్ చేసింది. ఆ తర్వాత ఐటీ సోదాలు (it raids) కొనసాగుతోన్నాయి. దేశంలో విపక్షాలపై ఐటీ (it), ఈడీ (ed), సీబీఐ (cbi) చేత కేంద్రం రైడ్స్ చేయిస్తోన్న వార్తలు మనం చూస్తున్నాం. ఈ సారి ఏకంగా బీబీసీ కార్యాలయాల్లో తనిఖీలు చేపడుతున్నారు.
Reports of Income Tax raid at BBC's Delhi office
Wow, really? How unexpected.
Meanwhile farsaan seva for Adani when he drops in for a chat with Chairman @SEBI_India office.