»I Eat Beef Meghalaya Bjp Chief Ernest Mawrie Controversy Comments
Meghalaya bjp chief:గొడ్డు మాంసం తింటా: మేఘాలయా బీజేపీ చీఫ్ కాంట్రవర్సీ కామెంట్స్
Meghalaya bjp chief controversy comments:మేఘాలయా బీజేపీ చీఫ్ ఎర్నెస్ట్ మావ్రీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తను గొడ్డు మాంసం తింటానని పేర్కొన్నారు. బీఫ్ తినడంపై తమ పార్టీలో నిషేధం ఏమీ లేదని అగ్నికి ఆజ్యం పోశారు. కులం, మతం, వర్గం అని బీజేపీ చూడదని అన్నారు. తాను బీఫ్ తినడం వల్ల బీజేపీకి ఎలాంటి సమస్య లేదని చెప్పారు.
Meghalaya bjp chief controversy comments:మేఘాలయా బీజేపీ చీఫ్ ఎర్నెస్ట్ మావ్రీ (Meghalaya bjp chief Ernest Mawrie) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తను గొడ్డు మాంసం తింటానని పేర్కొన్నారు. బీఫ్ తినడంపై తమ పార్టీలో నిషేధం ఏమీ లేదని అగ్నికి ఆజ్యం పోశారు. కులం, మతం, వర్గం అని బీజేపీ చూడదని అన్నారు. తాను బీఫ్ తినడం వల్ల బీజేపీకి ఎలాంటి సమస్య లేదని చెప్పారు.
తాము ఏం చేయాలనుకున్నామో అదీ చేయవచ్చు అని.. తమ పార్టీలో ఆంక్షలు లేవని చెప్పారు. బీఫ్ (beaf) తినడం అనేది ఆహార అలవాటు అని తనను తాను సమర్థించుకున్నాడు. ఆ విషయం రాజకీయ పార్టీకి ఏం సంబంధం? అని అడిగారు. తానే కాదు.. మేఘాలయలో ప్రతీ ఒక్కరు బీఫ్ తింటారని పేర్కొన్నారు. గొడ్డు మాంసం తినడానికి ఇక్కడ ఆంక్షలు ఏమీ లేవని చెప్పారు. ఇదీ తమ అలవాటు.. సంస్కృతిలో భాగం అని పేర్కొన్నారు.గో హత్య గురించి కూడా ఆయన మాట్లాడారు. తమ ఆహారపు అలవాట్లు మార్చుకోవాలని ఎక్కడ లేదని చెప్పారు.
When asked about the party's stance on cow slaughter, which is considered sacred in Hinduism, Meghalaya BJP State President Ernest Mawrie stated that "We follow our own food habit and there is no ban, there are no direction for us."https://t.co/XFVeo9wt3a
మేఘాలయా అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ 60 స్థానాల్లో పోటీకి దిగుతుందని చెప్పారు. రాష్ట్రంలో ఎన్సీపీ, యూడీపీ, బీజేపీ మధ్య త్రిముఖ పోరు ఉంటుందని తెలిపారు. కనీసం 34 సీట్లు గెలుచుకొని అధికారం చేపడుతామని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి, అభివృద్ది కావాలంటే బీజేపీకే పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నెల 27వ తేదీన మేఘాలయా అసెంబ్లీకి ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. మార్చి 2వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి.. అదే రోజు ఫలితం ప్రకటిస్తారు. ఇంతలో బీజేపీ చీఫ్ చేసిన కామెంట్స్ చర్చకు దారితీశాయి. దీనిని ఇతర పక్షాలు ప్రచార అస్త్రంగా మలచుకునే ఛాన్స్ ఉంది.