»Goods Train Derails At Delhi Sarai Rohilla Station
Train Accident : ఢిల్లీ లో ఘోర రైలు ప్రమాదం.. ఎనిమిది భోగీలు బోల్తా
ఢిల్లీలోని రెసిడెన్షియల్ కాలనీ సమీపంలో రైలు ప్రమాదం జరిగింది. ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పి బోల్తా పడింది. దీంతో 10 వ్యాగన్లు బోల్తా పడ్డాయి. ఈ ఘటనతో దట్టమైన పొగలు అలుముకున్నాయి.
Train Accident : ఢిల్లీలోని రెసిడెన్షియల్ కాలనీ సమీపంలో రైలు ప్రమాదం జరిగింది. ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పి బోల్తా పడింది. దీంతో 10 వ్యాగన్లు బోల్తా పడ్డాయి. ఈ ఘటనతో దట్టమైన పొగలు అలుముకున్నాయి. పెద్ద శబ్ధం రావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మరోవైపు ప్రయాణికులతో వెళ్తున్న రైలును మరో ట్రాక్‌పై నిలిపివేస్తున్నారు. అటువైపు బోల్తా పడకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
ఈ ఘటన ఢిల్లీలోని సరాయ్ రోహిల్లా టెర్మినల్ రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అధికారులు, రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. గూడ్స్ రైలులోని కనీసం 10 వ్యాగన్లు పట్టాలు తప్పినట్లు పోలీసులు తెలిపారు. జకీరా ఫ్లై ఓవర్ సమీపంలో ఉదయం 11:50 గంటల ప్రాంతంలో పటేల్ నగర్-దయాబస్తీ సెక్షన్లో ఈ ఘటన జరిగినట్లు వెల్లడించారు. ట్రాక్ లోపం వల్లే ఈ ఘటన జరిగినట్లు ప్రాథమిక అంచనా.
#WATCH | Eight wagons of a goods train derail on Patel Nagar-Dayabasti section in Delhi area. The incident occurred near the Zakhira flyover. pic.twitter.com/bjZcypbbZK