»Digvijay Singh There Is No Question Of Kamal Nath Joining Bjp
Digvijay Singh: కమల్‌నాథ్ బీజేపీలో చేరే ప్రసక్తి లేదు
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ బీజేపీలో చేరనున్నరని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే కమల్‌నాథ్ బీజేపీలో చేరే ప్రసక్తి లేదని.. దిగ్విజయ్ సింగ్ తెలిపారు.
Digvijay Singh: మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ బీజేపీలో చేరనున్నరని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే కమల్‌నాథ్ బీజేపీలో చేరే ప్రసక్తి లేదని.. దిగ్విజయ్ సింగ్ తెలిపారు. తాను కమల్‌నాథ్‌తో మాట్లాడానని.. అతను ఎక్కడికి వెళ్లడం లేదన్నారు. ఆయన బీజేపీలో చేరడం లేదన్నారు. కాంగ్రెస్‌ను వీడి అతను బీజేపీలో చేరతారన్న వార్త కేవలం కల్పితం మాత్రమేనని దిగ్విజయ్ సింగ్ తెలిపారు. ఆయన ఎప్పటికీ సోనియా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ను విడిచిపెట్టి వెళ్లరన్నారు.
ప్రస్తుతం ఢిల్లీలో బీజేపీ భారీ సమావేశం జరుగుతున్నది. మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ నేతలంతా అక్కడే ఉన్నారు. ఈసమయంలో కమల్‌నాథ్‌తో పాటు ఆయన కుమారుడు నకుల్ నాథ్ కూడా ఢిల్లీ వెళ్లడంతో ఈ వార్త ప్రచారం సాగింది. మధ్యప్రదేశ్ పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పించిననాటి నుంచి కమల్‌నాథ్ ఆగ్రహంతో ఉన్నట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆ తర్వాత ఆయన పార్టీ కార్యక్రమాలకు ఎక్కువగా హాజరవడం లేదన్నారు.