Arvind Kejriwal: నాకు ఇంజక్షన్లు ఇవ్వండి.. కోర్టులో కేజ్రీవాల్ పిటీషన్
షుగర్ లెవల్స్ పెరుగుతున్నాయని ఇన్సిలిన్ ఇంజన్లు కావాలంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కోర్టులో పిటిషన్ వేశారు. తన డైట్ తదితర అంశాలపై ఈ రోజు కోర్టు విచారణ జరపనుంది.
Give me injunctions.. Kejriwal's petition in court
Arvind Kejriwal: మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తీహార్ జైలులో కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆయనకు షుగర్ లెవల్స్ పెరుగుతున్నాయని, ఆయన ఆరోగ్యం దృష్ట్యా రౌస్ రెవిన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదే విషయాన్ని ఆప్ వెల్లడించింది. కేజ్రీవాల్‌కు షుగర్ లెవల్స్ పెరుగుతున్నాయని ఆయనకు ఇన్సిలిన్ ఇంజన్లను సమకూర్చలని ఆయన తరఫు న్యాయవాది కోర్టులో పిటీషన్ వేశారు. దీనిపై ఈ రోజు మధ్యహ్నం 2 గంటలకు విచారణ జరగనుంది.
షూగర్ సమస్య కారణంగా ఏప్రిల్ 14 నాటికి 276 ఎంజీ/డీఎల్‌గా షూగర్ లెవల్స్ నమోదైయ్యాయి. దాంతో డాక్టర్స్ కలిసిందేకు అనుమతి కావాలని కోర్టును ఆశ్రయించారు. దీనిపై ఈడీ కౌంటర్ పిటిషన్ వేసింది. ఆయనకు ఇంటి భోజనం తినే వెసులబాటు ఉండడంతో ఇష్టం వచ్చింది తిని కావాలనే షూగర్ లెవల్స్ పెంచుకుంటున్నారని ఆరోపించింది. దీంతో ఈడీ ఆరోపణలు కేజ్రీవాల్ తరఫు న్యాయవాది తిప్పికొట్టారు. ఇద్దరి వాదనలు విన్న కోర్టు ఆయనకు ఇంటి నుంచి వచ్చే ఆహార వివరాలు, అలాగే జైలులో ఆయనకు అందించే డైట్ వివరాలు ఇవ్వాలని అధికారులను అదేశించింది. దీనిపై ఆప్ నేతలు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. మధుమేహం ఉన్నవారిపట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అది కనీస బాధ్యత అని అంటున్నారు.