»Ed Conducts Raid At House Of Lalu Yadavs Aide In Bihar
IRCTC scam:లాలు సన్నిహితుడి ఇంట్లో ఈడీ సోదాలు
IRCTC scam:ఐఆర్సీటీసీ స్కాంలో (IRCTC scam) ఈడీ అధికారులు (ed) బీహర్ మాజీ ముఖ్యమంత్రి లాలుప్రసాద్ యాదవ్ (lalu prasad yadav) సన్నిహితుడు అబు దొజానా (abu dojana) ఇంట్లో తనిఖీలు చేశారు. పాట్నాలో (patna) గల ఆయన ఇంటి వద్దకు ఈడీ అధికారులు చేరుకొని.. సోదాలను నిర్వహించారు.
ED conducts raid at house of Lalu Yadav's aide in Bihar
IRCTC scam:ఐఆర్సీటీసీ స్కాంలో (IRCTC scam) ఈడీ అధికారులు (ed) బీహర్ మాజీ ముఖ్యమంత్రి లాలుప్రసాద్ యాదవ్ (lalu prasad yadav) సన్నిహితుడు అబు దొజానా (abu dojana) ఇంట్లో తనిఖీలు చేశారు. పాట్నాలో (patna) గల ఆయన ఇంటి వద్దకు ఈడీ అధికారులు చేరుకొని.. సోదాలను నిర్వహించారు.
లాలు ప్రసాద్ యాదవ్ (lalu prasad yadav) రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఐఆర్సీటీసీ కుంభకోణం వెలుగుచూసింది. దీనికి సంబంధించి ఇదివరకే సీబీఐ (cbi) కేసు నమోదు చేసింది. రాంచి (ranchi), పూరీలోని (puri) ఐఆర్సీటీసీ హోటళ్లను రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో లాలూ ప్రసాద్ యాదవ్ (lalu prasad yadav) ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టారని.. దీంతో అక్రమాలకు పాల్పడ్డారని సీబీఐ ఆరోపించింది. ఐఆర్సీటీసీ నిర్వహించే రెండు హోటళ్లను సుజాతా హోటల్స్ (sujatha hotels) అనే ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టారని పేర్కొంది. అందుకు ప్రతిఫలంగా పాట్నాలో (patna) బినామీ కంపెనీ పేరుతో మూడు ఎకరాల విలువైన స్థలాన్ని (సుమారు రూ.45 కోట్లు) పొందారని లాలూ ప్రసాద్ యాదవ్ (lalu prasad yadav) కుటుంబంపై ఆరోపణలు ఉన్నాయి. ఆ రెండు హోటళ్లను క్విడ్ ప్రోకో కింద ఆ సంస్థకు అప్పగించారని.. టెండర్ (tender) దక్కగానే ఆ స్థలం లాలూ ప్రసాద్ యాదవ్ (lalu prasad yadav) కుటుంబ సభ్యుల చేతుల్లోకి వెళ్లిందని సీబీఐ (cbi) అభియోగాలు మోపింది.
ఈ కేసులోనే ఈ రోజు లాలు ప్రసాద్ యాదవ్ సన్నిహితుడు అబు దొజానా (abu dojana) ఇంట్లో ఈడీ అధికారులు (ed officials) సోదాలు చేశారు. క్విడ్ ప్రోకోలో అబు పాత్ర గురించి ఆరా తీస్తున్నారు. దానికి సంబంధించి విలువైన పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.