»Ec Preparations For Lok Sabha Elections 2024 Instructions To State Governments Regarding Transfer Of Officers
Election Commission: సన్నాహాలు ప్రారంభించిన ఈసీ.. అధికారుల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు
వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ఎన్నికల సంఘం సన్నాహాలు ప్రారంభించింది. సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లకు సంబంధించి కమిషన్ కొత్త ఉత్తర్వులు జారీ చేసింది.
Election Commission to announce Karnataka assembly poll dates today
Election Commission: వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ఎన్నికల సంఘం సన్నాహాలు ప్రారంభించింది. సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లకు సంబంధించి కమిషన్ కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. మూడేళ్లు పూర్తయిన తర్వాత జిల్లా నుంచి బదిలీ అయిన అధికారులను తిరిగి అదే పార్లమెంటరీ నియోజకవర్గంలోని ఏ ఇతర జిల్లాకు పంపకుండా చూడాలని ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. రెండు పార్లమెంటరీ నియోజకవర్గాలను కలిగి ఉన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు మినహా మిగిలిన అన్ని రాష్ట్రాలు ఈ సూచనను పాటించవలసి ఉంటుందని ఎన్నికల సంఘం తెలిపింది. జిల్లా నుంచి బదిలీ అయిన అధికారులను తిరిగి అదే పార్లమెంటరీ నియోజకవర్గానికి పంపకూడదని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి.
ప్రస్తుత వ్యవస్థలోని లోపాలను తొలగించేందుకు ఎన్నికల సంఘం ఈ సూచనను ఇచ్చింది. ఎన్నికల సంఘం పాలసీ ప్రకారం, సొంత జిల్లాలో పోస్టింగ్ పొందిన లేదా మూడేళ్లు పూర్తయిన అధికారులందరినీ బదిలీ చేయాలని ఆదేశాలు ఉన్నాయి. ప్రత్యక్షంగా లేదా పర్యవేక్షణలో ఏ విధంగానైనా ఎన్నికల పనితో అనుసంధానించబడిన అధికారులు ఇందులో ఉన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి, ఎన్నికల సంఘం వివిధ రాష్ట్రాలను సందర్శించడం, ఏర్పాట్లను సమీక్షించడం ప్రారంభించింది. ఈ మేరకు చెన్నైలో తమిళనాడు, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరి ఎన్నికల అధికారులతో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ సమావేశమయ్యారు. ఈ రాష్ట్రాల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలపై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కూలంకషంగా చర్చించారు. దీంతో పాటు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఖర్చుపై నిఘా పెట్టాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఇది కాకుండా, ఎన్నికల వాగ్దానాల వివరాలను ఉచితాలతో సహా పంపాలని కమిషన్ కోరింది. కమిషన్ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటిస్తున్నారా లేదా అనే విషయాన్ని కూడా ప్రచారం సమయంలో గుర్తుంచుకోవాలని ఆదేశించింది.