మద్యం మత్తులో పురుషులే కాదు మహిళలు (Women) కూడా రెచ్చిపోతున్నారు. పీకలదాకా మందు తాగేసి నడిరోడ్డుపై హంగామా చేస్తున్నారు. లేడి అనే సంగతి మర్చిపోయి రౌడీలా వ్యవహరిస్తున్నారు. పచ్చి బూతులు తిడుతూ పోలీసులపైనే దాడులకు తెగబడుతున్నారు. తాజాగా గుజరాత్ (Gujarat) రాష్ట్రం వడోదరలో ఘటన జరిగింది.ఫుల్గా మద్యం సేవించిన ఒక మహిళ కారు డ్రైవ్ చేసింది. ఈ నేపథ్యంలో ఒక వాహనాన్ని ఢీకొట్టింది. కాగా, ఈ సమాచారం అందుకున్న పోలీసులు (Police) సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే మద్యం మత్తులో ఉన్న ఆ మహిళ పోలీసులను అసభ్యంగా తిట్టింది.
అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించిన వారిపై దాడి (Attack) చేసింది. దీంతో మహిళా పోలీసులను రప్పించారు. వారి సహాయంతో ఆమెను బలవంతంగా కారు నుంచి కిందకు దించారు. పోలీస్ వాహనంలోకి ఎక్కించబోయిన మహిళా పోలీసులను కూడా ఆమె కొట్టింది. చివరకు ఆమెను పోలీస్ స్టేషన్కు తరలించారు.వీడియోలు సోషల్ మీడియా(Social media)లో వైరల్ గా మారాయి. మద్యం మత్తులో ఆమె చేసిన అల్లరి అందరినీ నివ్వెరపోయేలా చేసింది. ద్యావుడా.. ఆడవాళ్లు ఏంటి ఇలా తయ్యారయ్యారు? అని తల పట్టుకున్నారు.కాగా.. మద్యం తాగి వాహనం నడపడం, హంగామా సృష్టించడం, ప్రభుత్వ ఉద్యోగిని విధులు నిర్వహించకుండా అడ్డుకోవడం వంటి అభియోగాలపై ఆమెపై కేసు (Case) నమోదైంది.