ఢిల్లీ ప్రభుత్వం ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన పథకాన్ని ప్రకటించారు. 18 ఏళ్లు నిండిన మహిళలందరికీ నెలకు రూ.1000 భృతి అందచేయనున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది.
Delhi: ఢిల్లీ ప్రభుత్వం ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన పథకాన్ని ప్రకటించారు. 18 ఏళ్లు నిండిన మహిళలందరికీ నెలకు రూ.1000 భృతి అందచేయనున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. ఢిల్లీ ఆర్థిక మంత్రి ఆతిశీ రూ.76000 కోట్ల బడ్జెట్‌ను సభలో సమర్పించింది. ఈ పథకం కోసం రూ.2000 కోట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. సార్వత్రిక ఎన్నికలకు ముందకు ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో బిజినెస్ బ్లాస్టర్స్ అనే పథకాన్ని విశ్వవిద్యాలయాలు, ఐటీఐలకూ విస్తరిస్తున్నట్లు అతిశీ ప్రకటించారు. ఇప్పటి వరకు ఈ పథకాన్ని స్కూళ్లలో మాత్రమే అమలు చేస్తున్నారు.
జీ20 సన్నాహాల్లో భాగంగా గతేడాది ప్రభుత్వం మొత్తం తొమ్మిది పథకాలను ప్రవేశపపెడుతూ రూ.78000 కోట్ల బడ్జెట్‌ను ప్రకటించింది. గతేడాది ఆర్థిక బాధ్యతలు చేపట్టిన ఆతిశీ మొదటిసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె విద్యాశాఖ మాజీ మంత్రి మనీశ్ సిసోదియా, ఆరోగ్యశాఖ మాజీ మంత్రి సత్యేందర్ జైన్‌ను గుర్తు చేసుకున్నారు. విద్య, ఆరోగ్య రంగాలకు ఒక రూపునివ్వడంలో వీళ్లు విశేషంగా కృషి చేసినట్లు తెలిపారు. తాజా బడ్జెట్లో విద్యారంగానికి రూ.16,396 కోట్లు, ఆరోగ్య శాఖకు రూ.8685 కోట్లు ప్రకటించారు.