Actress Samantha visited Sri Venkateswara Swamy in Tirumala
Samantha: టాలీవుడ్ నటి సమంత(Samantha) తిరుమలలో ప్రత్యక్షం అయింది. ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనంలో తన వ్యక్తిగత సిబ్బందితో వెంకటేశ్వరస్వామిని సేవించారు. టీటీడీ అధికారులు ఆమెకు ప్రత్యేక దర్శనం కోసం ఏర్పాట్లు చేశారు. ఆలయ అర్చకులు సమంత పేరుమీద పూజలు చేశారు. తీర్థప్రసాదాలను స్వీకరించిన అనంతరం సమంత ఆలయ ప్రాంగణంలో కనిపించారు. సమంతను చూసిన భక్తజనం తన వద్దకు వెళ్లే ప్రయత్నం చేశారు. దాంతో ఆలయం పరిసరాల్లో కోలాహలం నెలకొంది. సమంత ఇవాళ తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయాన్ని దర్శించిన తెలిసిందే. అక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వర్తించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. ప్రస్తుతం సిటాడెల్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే మరిన్ని సినిమాల్లో అలరించాలని సమంత అభిమానులు కోరుకుంటున్నారు.