»Daughter Sucks Venom Saves Mother From Cobra Bite In Karnataka
cobra bite: తల్లిని కాటేసిన నాగుపాము, విషాన్ని పీల్చి కాపాడిన కూతురు
సాహసోపేతమైన, సమయానుకూల చర్య... పాము కాటుకు గురైన (cobra bite) తన తల్లిని ఓ కాలేజీ విద్యార్థిని కాపాడిన సంఘటన కర్నాటకలోని దక్షిణ కన్నడ జిల్లా పుత్తూరు ప్రాంతంలో జరిగింది.
సాహసోపేతమైన, సమయానుకూల చర్య… పాము కాటుకు గురైన (cobra bite) తన తల్లిని ఓ కాలేజీ విద్యార్థిని కాపాడిన సంఘటన కర్నాటకలోని దక్షిణ కన్నడ జిల్లా పుత్తూరు ప్రాంతంలో జరిగింది. శ్రమ్య రాయ్ డిగ్రీ కాలేజీ విద్యార్థిని. ఓ ప్రయివేటు కళాశాలలో చదువుతోంది. పాము కాటుకు గురైన తన తల్లిని కాపాడింది ఈ సాహసి (Daughter sucks venom). ఈ సంఘటన నాలుగైదు రోజుల క్రితం జరిగింది. నెటిజన్లు ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. మమతా రాయ్… గ్రామ పంచాయదీ మెంబర్, శ్రమ్య రాయ్ తల్లి. కెయ్యూరు తాలుకా పరిధిలోని ఎట్కెడ్య గ్రామంలోని తన ఫామ్ లాండ్ లో పంప్ స్విచ్ ఆన్ చేసేందుకు వెళ్లింది మమత. తిరిగి వచ్చేటప్పుడు అనుకోకుండా కోబ్రా స్నేక్ పైన కాలు వేసింది. ఆ పాము ఈమెను కాటు వేసింది. ఆమె భయంతో కేకలు వేసింది. తల్లికి పాము కాటు వేయడంతో శ్రమ్య వేగంగా స్పందించింది.
వెంటనే అప్రమత్తమై శరీరంలోకి విషం పైకి వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఎండు గడ్డితో గట్టిగా ముడి వేసింది. ఎండు గడ్డితో ముడి అంతగా ఫలితం ఇవ్వదని భావించి, ఆ తర్వాత పాము కాటు వేసిన చోట గాయం నుండి విషాన్ని పీల్చి, ఉమ్మేసింది. ఆ తర్వాత ఇరుగుపొరుగు వారి సాయంతో తల్లి మమతను ఆసుపత్రికి తీసుకు వెళ్లింది. సమయస్ఫూర్తితో తల్లి ప్రాణాలను కాపాడిన శ్రమ్యను అందరూ ప్రశంసించారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
శ్రమ్య మాట్లాడుతూ… పాము కాటు వేసినట్లు తన తల్లి తనకు చెప్పిందని, దీంతో కాటు పైన ఎండు గడ్డి కట్టినప్పటికీ.. విషం ఇతర శరీర భాగాల్లోకి వ్యాప్తి చెందదనే నమ్మకం తనకు లేదని, అందుకే నోటి ద్వారా విషాన్ని పీల్చి, ఉమ్మేశానని చెప్పింది. తాను ఇలా చేయడం ఇదే మొదటిసారి అని, ప్రథమ చికిత్స టెక్నిక్ గురించి తాను విన్నానని, కొన్ని సినిమాల్లో కూడా చూశానని, అందుకే ధైర్యం చేసినట్లు చెప్పింది.