Congress leader Jairam Ramesh tweeted on Bank of Baroda's withdrawal from auctioning MP Sunny Deol's villa.
Jairam Ramesh: బీజేపీ ఎంపీ, నటుడు సన్నీ డియోల్ (Sunny Deol) విల్లాను వేలం వేస్తున్నట్లు ఇచ్చిన నోటీసులను బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) విత్ డ్రా చేసుకోవడంపై కాంగ్రెస్(Congress) సీనియర్ నేత జయ్‌రామ్ రమేశ్(Jairam Ramesh) సందేహాం వ్యక్తం చేశారు. సన్ని డియోల్ 2022 డిసెంబర్ నుంచి జరిమానా, వడ్డీతో సహా మొత్తం రూ.55.99 కోట్ల రుణం చెల్లించాలని బ్యాంక్ పేర్కొంది. ఆయన రియాక్ట్ కాలేదు. దీంతో ఆ మొత్తాన్ని రికవరిలో భాగంగా ముంబైలో గల జుహూ (Juhu)లో ఉన్న రూ.51.43 కోట్ల విలువ చేసే విల్లాను ఈనెల 25న ఈ-వేలం (e-auction) వేయనున్నట్టు ఆదివారం నోటీసులు ఇచ్చింది. విల్లాతో పాటు 599.44 చ.మీలలో ఉన్న సన్నీ డియోల్, ఆయనకు వ్యక్తిగత గ్యారంటీదారుగా ఉన్న అతని తండ్రి ధర్మేంద్ర భవనాలను కూడా వేలం వేస్తున్నట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. నోటీసులు జారీ చేసి కనీసం 24 గంటలు కూడా గడవనే లేదు అప్పుడే ఈ వేలంను విత్ డ్రా చేసుకున్నామని చెప్పడంపై పలువురు కాంగ్రెస్ నేతలు అనుమానం వ్యక్తం చేశారు. దీని వెనక ఎన్టీఏ ప్రభుత్వం ఉందని.. ఇన్‌డైరెక్ట్‌గా కామెంట్లు చేస్తున్నారు.
బాకీ పడిన రూ.56 కోట్లను చెల్లించకపోవడంతో బీజేపీ ఎంపీ సన్నీ డియోల్‌కు చెందిన జుహూలోని నివాసాన్ని బ్యాంక్ ఆఫ్ బరోడా ఈ-వేలానికి ఉంచింది. ఈ ఉదయం సాంకేతిక కారణాల వల్ల వేలం నోటీసును బీవోబీ వెనక్కి తీసుకున్నామని తెలిసింది. ఆ సాంకేతిక కారణాలు.. ఎవరి వల్ల తలెత్తాయో తెలుసని కాంగ్రెస్ సీనియర్ నేత జయ్‌రామ్ రమేశ్ (Jairam Ramesh) వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియా వైరల్‌గా మారింది. చాలామంది బీజేపీ మంత్రి నుంచి బ్యాంక్‌కు ఫోన్ వచ్చిందని, అందుకే నిలిపివేసిందని కామెంట్లు చేస్తున్నారు.