»Bengaluru Records Highest March Temperature In Seven Years
Bengaluru : బెంగళూరులో రికార్డు సృష్టిస్తున్న ఎండలు
సిలికాన్ సిటీగా పేర్గాంచిన బెంగుళూరు పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోంది. ఓ వైపు వర్షాభావ పరిస్థితులు, నీటి ఎద్దడితో అల్లాడుతున్న బెంగళూరు నగరంపై భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు.
High temperature record at andhra pradesh nandyala
Bengaluru : సిలికాన్ సిటీగా పేర్గాంచిన బెంగుళూరు పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోంది. ఓ వైపు వర్షాభావ పరిస్థితులు, నీటి ఎద్దడితో అల్లాడుతున్న బెంగళూరు నగరంపై భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. నగరంలో వడగళ్ల వానలు, ఉష్ణోగ్రతలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గత ఏడేళ్లలో ఎన్నడూ లేని విధంగా మార్చి నెలలో నగరంలో భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కర్ణాటక రాష్ట్ర సహజ విపత్తు పర్యవేక్షణ కేంద్రం (KSNDMC) ప్రకారం, ఈ సంవత్సరం ఉష్ణోగ్రత పెరుగుదల అసాధారణంగా ఉంది. గత ఏడేళ్లలో ఈ సంవత్సరం రికార్డు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మార్చి 28, 2024న బెంగళూరులో 37.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. గతేడాది ఇదే రోజున 37.5 డిగ్రీలు నమోదైంది.
ఈ ఉష్ణోగ్రతలు పెరగడానికి అనేక అంశాలు దోహదం చేస్తున్నాయి. ఈ ఏడాది రుతుపవనాలకు ముందు వర్షాలు కురవకపోవడం, వేగవంతమైన పట్టణీకరణ, పెరిగిన కాంక్రీట్ నిర్మాణాల ఫలితంగా ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని నిపుణులు చెబుతున్నారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా నివాసితులు ఇంట్లోనే ఉండి పుష్కలంగా నీరు తాగాలని హెచ్చరిక జారీ చేయబడింది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున, ఎండ సమయంలో బహిరంగ కార్యకలాపాలకు దూరంగా ఉండటం, తేలికైన, గాలి తగిలేందుకు అనువుగా ఉండే దుస్తులు ధరించడం వంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని KSNDMC ప్రజలను కోరింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో బెంగళూరులో నీటి ఎద్దడి మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది.