Pushpa 2: ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సినిమాల్లో పుష్ప2 పై భారీ అంచనాలున్నాయి. ఈ మోస్ట్ అవైటేడ్ ప్రాజెక్ట్‌ను సుకుమార్ ఎంతో ప్రతిష్టాత్మంగా తెరకెక్కిస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్లో వెయ్యి కోట్లు టార్గెట్‌గా పుష్ప2 రాబోతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కూడా ఎక్కడా కాంప్రమైజ్ అవుకుండా ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్టేజీలో ఉంది. ఆగష్టు 15న పుష్ప2 రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు పుష్ప2 నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు.. వేర్ ఈజ్ పుష్ప అంటూ వచ్చిన వీడియో అంచనాలను పెంచేసింది. ఇక ఇప్పుడు టీజర్ రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే నెలలో.. అంటే ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే ఉంది. ఈ సందర్భంగా.. బన్నీ బర్త్ డే కానుకగా పుష్ప2 టీజర్ రిలీజ్ చేస్తున్నట్టుగా స్ట్రాంగ్ బజ్ వినిపిస్తుంది.
అయితే.. దీనిపై ఇంకా అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. కానీ పుష్ప2 టీజర్ మాత్రం మామూలుగా ఉండదనే చెప్పాలి. ఖచ్చితంగా పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసేలా ఈ టీజర్ ఉండనుంది. బన్నీ అమ్మవారి గెటప్‌కు సంబంధించిన షార్ట్స్‌తో పాటు.. హై ఓల్టేజ్ యాక్షన్‌ను టీజర్లో చూపించే ఛాన్స్ ఉంది. దీంతో.. ఇప్పటివరకున్న డిజిటల్ రికార్డ్స్ అన్నీ కూడా చెల్లా చెదురయ్యే అవకాశాలున్నాయి. ఎందుకంటే.. ఈ సినిమా కోసం తెలుగు ఆడియెన్స్ ఏ రేంజ్లో వెయిట్ చేస్తున్నారో? అంతకుమించి అనేలా నార్త్ ఆడియెన్స్ వెయిట్ చేస్తున్నారు. పుష్ప పార్ట్ 1 తెలుగులో కంటే హిందీలోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తుండగా ఫహద్ ఫాజిల్ విలన్‌గా నటిస్తున్నాడు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మరి పుష్ప2 ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.