Magadheera: ఫ్లాప్ అయిన మగధీర రీ రిలీజ్.. ఎందుకిలా?
రామ్ చరణ్, రాజమౌళి కాంబోలో వచ్చిన మగధీర.. అప్పట్లో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసింది. కానీ ఈ సినిమా రీ రిలీజ్ విషయంలో మాత్రం ఫ్లాప్ అయింది. అసలు ఎందుకిలా జరిగింది? రీ రిలీజ్ రెస్పాన్స్ ఏంటి?
Magadheera: ఈ మధ్య టాలీవుడ్లో రీ రిలీజ్ ట్రెండ్ ఓ రేంజ్లో నడుస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోల హిట్ బొమ్మలు ఏదో ఒక అకేషన్‌కు రీ రిలీజ్ అయి ట్రెండ్ క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పటికే పోకిరి, జల్సా, సింహాద్రి లాంటి సినిమాలు రీ రిలీజ్ కలెక్షన్స్‌తో అదరగొట్టాయి. అలాగే చరణ్ ఫ్లాప్ సినిమా ఆరెంజ్ కూడా సూపర్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. అప్పట్లో ఈ సినిమా దారుణ పరాజయాన్ని మూటకట్టుకుంది. కానీ రీ రిలీజ్‌తో దుమ్ముదులిపేసింది ఆరెంజ్. ఏకంగా 3 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. కానీ హిట్ బొమ్మ మగధీర విషయంలో మాత్రం సీన్ రివర్స్ అయింది.
రామ్ చరణ్ కెరీర్లో ఫస్ట్ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది మగధీర. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా.. 2009లో ఇండస్ట్రీ రికార్డులన్నింటినీ తిరగరాసింది. రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన ఈ సినిమా.. 100 కోట్లకుపైగా వసూలు చేసి సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. అలాంటి సినిమా రీ రిలీజ్ విషయంలో మాత్రం డిజాస్టర్‌గా నిలిచింది. ఈసారి చరణ్ 39వ బర్త్ డే సందర్భంగా మగధీర సినిమాను రీ రిలీజ్ చేశారు. కానీ మెగా ఫ్యాన్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేసినంత రెస్పాన్స్ రాలేదనే చెప్పాలి. అక్కడక్కడా కొన్ని ఫ్యాన్స్ షోలతో రచ్చ చేసినప్పటికీ.. చాలా వరకూ షోల ఆక్యుపెన్సీ చాలా తక్కువగా ఉన్నాయి. దీంతో.. ఈ హిట్ మూవీని ఇప్పుడెందుకు అభిమానులు పట్టించుకోలేదు అన్నది అంతుబట్టని విషయమే.