»Bengaluru Housing Society Rs 5 Thousand Fine For Wasting Water
Bengaluru Housing Society: నీరు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా!
వేసవిలో చాలా ప్రాంతాల్లో నీటికొరత ఉంటుంది. అయితే బెంగళూరులోని కొన్ని ప్రాంతాల్లో వేసవి రాకముందే నీళ్ల సమస్య ఏర్పడింది. ఈక్రమంలో ఓ హౌసింగ్ సోసైటీ నీరు వృథా చేస్తే రూ.5 వేల ఫైన్ విధిస్తామని హెచ్చరించింది.
Bengaluru Housing Society: వేసవిలో చాలా ప్రాంతాల్లో నీటికొరత ఉంటుంది. అయితే బెంగళూరులోని కొన్ని ప్రాంతాల్లో వేసవి రాకముందే నీళ్ల సమస్య ఏర్పడింది. ఈక్రమంలో ఓ హౌసింగ్ సోసైటీ నీరు వృథా చేస్తే రూ.5 వేల ఫైన్ విధిస్తామని హెచ్చరించింది. బెంగళూరులోని కనకపుర, యల్హంక, వైట్ఫీల్ట్ ప్రాంతాల్లో ఉండే స్థానికులు నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రాంతంలో నివసించేవాళ్లు ఎవరైనా ఎక్కువగా నీటిని వినియోగిస్తే జరిమానా విధిస్తామని హెచ్చరికలు జారీ చేసింది. దీన్ని పర్యవేక్షించేందుకు పత్యేకంగా సెక్యూరిటీని కూడా నియమించింది.
గత నాలుగు రోజుల నుంచి బెంగళూరు నగరపాలక సంస్థ వాటర్ బోర్డు నుంచి నీరు రావడం లేదు. ప్రస్తుతం బోర్ల ద్వారా నీరు అందిస్తున్నాం. హౌసింగ్ సొసైటీలో నివసించేవాళ్లు నీటి వినియోగాన్ని 20 శాతం తగ్గించాలని కోరుతున్నం. దీనివల్ల వేసవిలో ఎక్కువ రోజులు నీరు వినియోగించుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా ఈ నిబంధనను అతిక్రమిస్తే వాళ్లకు రూ.5 వేలు జరిమానా విధిస్తాం. ప్రత్యేకంగా నియమించిన భద్రతా సిబ్బంది నీటి వినియోగాన్ని పర్యవేక్షిస్తారని నోటీసుల్లో జారీ చేసింది. ఇందులో భాగంగా నగరంలోని ట్యాంకర్ల యజమానులు మార్చి 7 నాటికి తప్పనిసరిగా ప్రభుత్వం వద్ద వివరాలు నమోదు చేయాలని ఆదేశించింది.