దేశ ప్రజలంతా ఎదురుచూసే మహత్తర ఘట్టం రామ మందిర ప్రాణప్రతిష్ఠ కొన్నిరోజుల్లో జరగనుంది. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి వీఐపీ టికెట్లు కావాలా? అంటూ చెప్పి డబ్బు కాజేస్తున్నారు.
Ayodhya Ram Mandhir: దేశ ప్రజలంతా ఎదురుచూసే మహత్తర ఘట్టం రామ మందిర ప్రాణప్రతిష్ఠ కొన్నిరోజుల్లో జరగనుంది. జనవరి 22వ తేదీన జరిగే అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్ఠ మహోత్సవాన్ని కళ్లారా చూడాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు. దీంతో చాలా మంది సైబర్ నేరగాళ్లు టికెట్ల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి వీఐపీ టికెట్లు కావాలా? అంటూ చెప్పి డబ్బు కాజేస్తున్నారు. రామ మందిర ప్రారంభోత్సవానికి వీఐపీ టికెట్లు కావాలంటే ఈ లింక్ క్లిక్ చేయండని సైబర్ నేరగాళ్లు వాట్సాప్ మెసేజ్‌లు పంపిస్తున్నారు.
మరికొందరు ఏపీకే ఫైల్ పంపించి యాప్‌ను ఇన్స్టాల్ చేసుకోమని చెబుతున్నారు. ఈ యాప్‌లో డైరక్ట్‌గా వీఐపీ యాక్సెస్ దొరుకుతుందని అంటుంటారు. ఇలాంటి మెసేజ్‌ల లింక్‌లను క్లిక్ చేసినా, ఏపీకే ఫైల్స్‌ను ఇన్స్టాల్ చేసుకున్న అకౌంట్లోని డబ్బు అంతా ఖాళీ చేసేస్తారు. వీటివల్ల మీ పర్సనల్, బ్యాంక్ డేటా మొత్తం స్కామర్ల చేతిలోకి వెళ్తుంది. అయోధ్య రామ మందిరం పేరుతో జరుగుతున్న ఈ మోసాలపై టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ జనాలను అప్రమత్తం చేశారు. ఇలాంటి మెసేజ్‌ల్లో వచ్చిన లింక్‌లను ఓపెన్ చేయవద్దని ఏపీకే ఫైల్స్ ఇన్స్టాల్ చేసుకోవద్దని సూచించారు.