కాంగ్రెస్ అగ్ర నేతలుగా ఉన్న రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీలు అమూల్ బేబీలంటూ అస్సాం సీఎం హిమంత శర్మ వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి.
Assam Cm Himanta Sarma : కాంగ్రెస్ ఉన్నత స్థాయి నేతలుగా ఉన్న రాహుల్ గాంధీ(Rahul Gandhi), ప్రియాంక గాంధీలను(Priyanka Gandhi) అస్సాం సీఎం హిమంత విశ్వ శర్మ ఎద్దేవా చేశారు. వారిద్దరూ అమూల్ బేబీలంటూ వ్యాఖ్యానించారు. ఈ మధ్య కాలంలో అస్సాంలో ప్రియాంక గాంధీ రోడ్ షో చేపట్టారు. దీంతో ఆమెపై సీఎం(Cm) ఈ విధంగా వెటకారంగా వ్యాఖ్యలు చేశారు. అమూల్ బేబీలను చూసేందుకు జనం ఎందుకు వెళతారని ఆయన ప్రశ్నించారు
ప్రియాంక ఎన్నికల ప్రచారానికి వెళ్లడానికి బదులుగా కజిరంగ నేషనల్ పార్కుకు వెళ్లాలని ఎద్దేవా చేస్తూ మాట్లాడారు. అక్కడ పులులు, ఖడ్గ మృగాలను చూస్తూ గడిపితే వారికి బాగుంటుందని అన్నారు.ఈ సమయం ఏదో అక్కడ గడిపితే సమయం మరింత ఆనందదాయకంగా ఉంటుందని వ్యాఖ్యానించారు.
అస్సాంలో ప్రియాంక చేపట్టిన రోడ్ షోకు రెండు నుంచి మూడు వేల మంది మాత్రమే హాజరయ్యారని అన్నారు. గాంధీ కుటుంబాన్ని చూడడం వల్ల ప్రజలు తమకు ఒరిగేది ఏమీ లేదని అనుకుంటున్నారని హిమంత శర్మ దుయ్యబట్టారు. అందుకనే ఆ రోడ్ షోకి జనమే రాలేదని వ్యాఖ్యలు చేశారు. వారు ఎన్నికల ప్రచారానికి కాకుండా అమూల్ పాల ప్రచారానికైతే సరిపోతారని అన్నారు. ఎందుకంటే వారు అమూల్ శిశువులు(Amul Babies) కాబట్టి అంటూ చెప్పుకొచ్చారు.