»Adverse Events Seen In Some Participants Who Took Covaxin Reports New Study
COVAXIN: కోవీషీల్డే అనుకున్నాం గానీ కోవాక్సిన్తోనూ చాలా సైడ్ ఎఫెక్ట్స్
కోవాక్సిన్ టీకా తీసుకున్న వారికి శ్వాసకోశ వ్యాధులు వెంటాడే ప్రమాదం ఎక్కువగా ఉందని బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం అధ్యయనంలో వెల్లడైంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి.
COVAXIN: కోవీ షీల్డ్ వల్లే కాదు కోవాక్సిన్ వేసుకున్న వారికి కూడా అనేక రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఓ అధ్యయనంలో తేలింది. బెనారస్ హిందూ యూనివర్సిటీ ఈ టీకా పై చేసిన అధ్యయనాల్లో పలు విషయాలు వెల్లడయ్యాయి. ముఖ్యంగా కౌమార దశలో ఉన్న మహిళలపై ఈ టీకా ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ కలిగిస్తోందని తెలిసింది.
భారత్ బయోటెక్ రూపొందించిన కోవాక్సిన్ వేసుకున్న వారికి అడ్వెర్స్ ఈవెంట్స్ ఆఫ్ స్పెషల్ ఇంట్రస్ట్ (ఏఈఎస్ఐAESI) వచ్చే ప్రమాదం ఉందని తేలింది. అంటే రక్తం గడ్డకట్టడం, ప్లేట్లెట్లు పడిపోవడం లాంటివి ఉంటాయి. పెద్దల్లో శ్వాసకోశ సమస్యల ముప్పు ఉందని వెల్లడైంది. మహిళల్లో రుతు క్రమం తప్పడం లాంటివీ ఉండొచ్చట. కాబట్టి కోవాక్సిన్(COVAXIN) వేసుకున్న వారికి ఇలాంటి లక్షణాలు ఏమైనా కనిపించినట్లైతే వెంటనే డాక్టర్ని సంప్రదించడం మేలు.
కోవిడ్ 19(COVID19) నుంచి రక్షించుకునే క్రమంలో మన దేశంలో చాలా మంది కోవాక్సిన్, కోవీ షీల్డ్ టీకాలను వేసుకున్నారు. అయితే ఈ మధ్య కాలంలో కోవీషీల్డ్(Covishield) టీకా వేసుకున్న వారికి రకరకాల అనారోగ్యాలు కలుగుతున్నయంటూ వార్తలు వస్తున్నాయి. ఈ విషయమై లండన్ హైకోర్టులో పలు వ్యాజ్యలు దాఖలు అయ్యాయి. దీంతో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని స్వయంగా కోవీషీల్డ్ తయారు చేసిన ఆస్ట్రోజెనికా సంస్థే కోర్డు ముందు ఒప్పకుంది. ఈ నేపథ్యంలో కోవాక్సిన్ వేసుకున్న వారంతా సేఫేనేమో అన్నట్లు అంతా భావించారు. అయితే దీనిపై జరిగిన అధ్యయనంలో దీని వల్లా ఇబ్బందులు ఉన్నట్లు వెల్లడైంది.