నటుడు రోబో శంకర్ (Robo Shankar) చిక్కుల్లో పడ్డారు. ఫారెస్ట్ ఆఫీసర్స్ అనుమతి లేకుండా రెండు అలెగ్జాండ్రైన్ (Alexandrine) జాతికి చెందిన చిలుకలను (parrots)పెంచినందకు వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో వాళ్లు శంకర్ ఇంటిపై దాడి చేసి ఆ చిలుకలను సీజ్ చేసి జూపార్క్ (zoopark) తరలించారు. ఇంటిని వీడియో తీసి ‘హోం టూర్’ (home tour) పేరుతో దానిని సోషల్ మీడియాలో షేర్ చేసిన తమిళ నటుడు అందుకు మూల్యం చెల్లించుకున్నాడు.
నటుడు రోబో శంకర్ (Robo Shankar) చిక్కుల్లో పడ్డారు. ఫారెస్ట్ ఆఫీసర్స్ అనుమతి లేకుండా రెండు అలెగ్జాండ్రైన్ (Alexandrine) జాతికి చెందిన చిలుకలను (parrots)పెంచినందకు వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో వాళ్లు శంకర్ ఇంటిపై దాడి చేసి ఆ చిలుకలను సీజ్ చేసి జూపార్క్ (zoopark) తరలించారు. ఇంటిని వీడియో తీసి ‘హోం టూర్’ (home tour) పేరుతో దానిని సోషల్ మీడియాలో షేర్ చేసిన తమిళ నటుడు అందుకు మూల్యం చెల్లించుకున్నాడు. ఆ వీడియోలో చిలుకలు ఉండడం చూసిన అటవీశాఖ అధికారులు వెంటనే ఆయన ఇంటికి చేరుకుని ఫర్రోట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. నటుడికి చెన్నై (Chennai) సాలిగ్రామంలో ఇల్లు ఉంది.ఈ వీడియో బాగా వైరల్ అయింది. అదే ఆయనకు చిక్కులు తెచ్చిపెట్టింది. అలెంగ్జాండ్రిన్ పారాకీట్ అనే రెండు చిలుకలు పంజరంలో ఉండడాన్ని గుర్తించిన అటవీశాఖ అధికారులు వెంటనే నటుడి ఇంటికి చేరుకున్నారు.
వాటిని స్వాధీనం చేసుకుని గిండీలోని పార్కులో అప్పగించారు. ఆ సమయంలో రోబో శంకర్,(Robo Shankar) ఆయన భార్య శ్రీలంకలో ఉండడంతో దర్యాప్తుకు హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేశారు. కుటుంబ సభ్యులు బోనులో ఉన్న చిలుకలకు ఎలా ఆహారాన్ని అందిస్తున్నారనేది ఇందులో చూపెట్టారు. ఆ వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా అతని ఇంటిపై అటవి శాఖ అధికారులు దాడి చేసి ఆ రెండు చిలుకలను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు సదరు రోబో శంకర్‌తో పాటు ఇంటి వాళ్లపై వైల్డ్ లైఫ్ (Wild life) యాక్ట్ కింద కేసు నమోదు చేసారు. ఈ సందర్భంగా అటవి శాఖ అధికారులు ఆ ఫర్రోట్స్ ఆరోగ్య పరిస్థితిని ఆరా తీసి వాటిని అటవిలో ఒదలేయాలా.. లేకపోతే జూ లోనే ఉంచాలనే విషయం పరిశీలిస్తున్నారు. ఏ నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి. ఈ కేసులో జైలు శిక్ష లేకున్నా.. రూ. 5 లక్షల వరకు జరిమాన విధించే అవకాశాలున్నాయని అటవి శాఖ అధికారులు (forest officers ) పేర్కొంటున్నారు.