ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబోలో తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప-2’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ మూవీ సెట్స్ నుంచి ఐకానిక్ పిక్చర్‌ను మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. మూవీ సెట్స్‌లో దర్శక దిగ్గజం రాజమౌళి సందడి చేశారు. ఈ సందర్భంగా సుకుమార్, ఆయన టీం రాజమౌళితో కలిసి దిగిన ఫొటోను నెట్టింట షేర్ చేయగా.. సూపర్ పిక్ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.