సంక్రాంతి పండుగకు ‘వీరసింహారెడ్డి’తో మాంచి విజయం అందుకున్న నటసింహం నందమూరి బాలకృష్ణ తదుపరి సినిమాలపై దృష్టి సారించాడు. విజయోత్సాహంతో ఇదే ఊపులో మిగతా సినిమాలన్నీ ఫటాఫట్ పూర్తి చేయాలని బాలయ్య ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతానికి బాలయ్య బాబు చేతిలో దాదాపు సినిమాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది యువ దర్శకుడు అనిల్ రావిపూడితో చేస్తున్న సినిమా. హాస్యానికి పెద్దపీట వేసే అనిల్ మరి బాలయ్యతో ఎలా హాస్యం పండిస్తాడో చూడాలి. ఈసారి తెలంగాణలో దిగుతుండు.. ఊచకోత కోస్తాడు అని ప్రకటించాడు.
అయితే బాలయ్య-అనిల్ సినిమాకు సంబంధించిన కీలకమైన అప్డేట్ వచ్చింది. ఈసారి ఏ స్టైల్లో బాలయ్య కనిపించబోతున్నాడో అనిల్ బయట పెట్టాడు. బాలయ్య అంటేనే రాయలసీమ గుర్తొస్తుంది. రాయలసీమల కథలకు బాలయ్య సెట్టయినంత ఎవరూ సెట్ కాలేదు. అయితే ఆ ట్రెండ్ మార్చాలని అనిల్ భావిస్తున్నాడు. అందుకే తాను బాలయ్యతో తెరకెక్కించబోతున్న సినిమా రాయలసీమ నేపథ్యంలో కాదు.. తెలంగాణ స్టైల్లో ఉంటుందని అనిల్ చెప్పాడు. ఈ మేరకు ఓ ఈవెంట్ లో అనిల్ అసలు విషయం చెప్పేశాడు. వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ లో ఈ విషయం అనిల్ చెప్పాడు.
‘సాధారణ ప్రేక్షకులతో పాటు అభిమానులకు నచ్చేలా సినిమా ఉండాలని బాలకృష్ణ జాగ్రత్తలు తీసుకుంటారు. అందుకే ప్రతి సినిమాకు తనదైన స్టైల్లో కనిపించాలని చూస్తారు. అదే కోణంలో వీరసింహారెడ్డి ఉంది. అయితే ఎన్బీకే 108 సినిమా దానికి భిన్నంగా ఉంటుంది. ఈసారి అన్న రాయలసీమలో కాదు.. తెలంగాణలో దిగుతుండు.. బాక్సాఫీస్ ఊచకోత షురూ చేస్తాడు. కలెక్షన్ లతో ఖుర్బానీ మీటా తినిపిస్తాడు. గెట్ రెడీ’ అంటూ అనిల్ రావిపూడి తెలిపాడు.