మాస్ మహారాజాకు పేరుకు తగ్గట్టే భారీ మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే.. థియేటర్ల దగ్గర మాస్ జాతర జరిపేందుకు రెడీగా ఉంటారు అభిమానులు. అయితే గతేడాది క్రాక్‌తో సక్సెస్ ట్రాక్ ఎక్కిన రవితేజ.. ఈ ఏడాది వచ్చిన ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలతో ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు.
దాంతో మాస్ రాజా అభిమానులు సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. అందుకే అప్ కమింగ్ ఫిల్మ్ ‘ధమాకా’పై భారీ ఆశలు పెట్టుకున్నారు. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో మాస్ మసాలాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను.. డిసెంబర్ 23న భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయినా పాటల్లో.. యంగ్ బ్యూటీ శ్రీలీలతో మాస్ స్టెప్పులతో అదరగొట్టాడు మాస్ రాజా. అయితే ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా.. రీ షూట్ విషయంలోనే భయపడుతున్నారు అభిమానులు.
ధమాకా సినిమా అవుట్ పుట్ చూసిన తర్వాత.. కొన్ని సీన్లు రవితేజకు నచ్చలేదట. దాంతో రీ టైట్ చేసి, రీ షూట్ చేసినట్టు సమాచారం. అంతేకాదు దానికోసం ఓ కొత్త రైటర్ హెల్ప్ కూడా తీసుకున్నారట. ఇక రీషూట్ తర్వాత ఫైనల్ వెర్షన్‌కు ఓకే చెప్పాడట రవితేజ. దాంతో త్వరలోనే ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నారని తెలుస్తోంది. అయితే ఈ మధ్య రీ షూట్ అనేది కామన్‌గా మారిపోయింది.
కానీ అలా చేసిన సినిమాలకు మాస్ మహారాజాకు కలిసి రావడం లేదనే టాక్ నడుస్తోంది. అసలు ఆ అవసరం ఎందుకొస్తుందనేది ఫ్యాన్స్ మాట. ఇంతకు ముందు వచ్చిన ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు కూడా.. తీరా రిలీజ్ సమయం వరకు రీ షూట్ చేస్తున్నారనే వినిపించింది. ముఖ్యంగా.. ఎంత రీ షూట్ చేసినా ‘రామారావు ఆన్ డ్యూటీ’ డిజాస్టర్ అయింది. అందుకే ధమాకా విషయంలో ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. మరి ధమాకా ఎల ఉంటుందో చూడాలి.