చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని అందుకుంది డీజే టిల్లు. ఈ సినిమాతో హీరో సిద్ధు జొన్నలగడ్డకు మంచి క్రేజ్ ఏర్పడింది. ఇప్పటికీ టిల్లుగాడు చెప్పిన డైలాగ్స్ నెట్టింట్లో వైరల్ అవుతునే ఉన్నాయి. విమల్ కృష్ణ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాలో నేహా శెట్టి గ్లామర్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. దాంతో సీక్వెల్‌ను గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సారి డైరెక్టర్‌తో పాటు హీరోయిన్ కూడా మారిపోయింది. డీజే టిల్లు2కు విమల్ కృష్ణ స్థానంలో ‘నరుడా డోనరుడా’, ‘అద్భుతం’ సినిమాల డైరెక్టర్ మల్లిక్ రామ్ వచ్చేశాడు. రీసెంట్‌గానే ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టారు. ప్రస్తుతం డీజే టిల్లు-2 షూటింగ్‌కు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. నైట్ టైమ్‌లో సిద్ధు జొన్నలగడ్డపై కొన్ని సీన్స్ చిత్రీకరించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఓ పిక్‌ను దర్శకుడు షేర్ చేసుకున్నాడు. అయితే రాధిక ప్లేస్‌లోకి రానున్న హీరోయిన్ ఎవరనేది క్లారిటీ రావడం లేదు. ఇటీవల యంగ్ బ్యూటీ శ్రీలీల షూటింగ్లో జాయిన్ అయిన తర్వాత.. ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందని వార్తలొచ్చాయి. ఇందులో నిజమెంతో తెలియదు గానీ.. మరో కొత్త బ్యూటీని తీసుకోబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. మరోసారి అనుపమ పరమేశ్వరన్ పేరు తెరపైకి వచ్చింది. అయితే ఈ అమ్మడు కూడా గతంలో రిజెక్ట్ చేసినట్టు వార్తలొచ్చాయి. కాబట్టి టిల్లుగాడి న్యూ గర్ల్ ఫ్రెండ్ ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే త్వరలోనే దీనిపై క్లారిటీ రానుందని తెలుస్తోంది.