మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘గాడ్ ఫాదర్’ మాసివ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయం రానే వచ్చేసింది. ఇప్పటికే గాడ్ ఫాదర్ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ స్పీడప్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఈ క్రమంలో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. ఈ మెగా ఈవెంట్ సెప్టెంబర్ 28న, సాయంత్రం 6 గంటల నుంచి అనంతపూర్ గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్‌లో గ్రాండ్‌గా జరగనున్నాయి. కానీ ఓ విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు.
ఈ మెగా ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్ ఎవరనేది సస్పెన్స్‌గా మారింది. అయితే ముందు నుంచి ‘గాడ్ ఫాదర్’ ఈవెంట్‌కు మెగా బ్రదర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెస్ట్‌గా వస్తారని ప్రచారం జరుగుతోంది. కానీ పవన్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉండటంతో.. ఇది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. దీంతో ఇప్పుడు తాజాగా మరో హీరో ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వస్తున్నారని సమాచారం. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. దాంతో ఈవెంట్ స్పెషల్ గెస్ట్‌గా సల్మాన్ ఖాన్ హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఇక మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ‘గాడ్ ఫాదర్’ సినిమాలో నయనతార కీలక పాత్రలో నటిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నాడు. మరి మలయాళ హిట్ మూవీ ‘లూసీఫర్’ రీమేక్‌గా తెరకెక్కిన ‘గాడ్ ఫాదర్’ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.