Mega 156 ఎందుకు పక్కన పెట్టేశారు? మెగా 157 ముందు ఎందుకు?
మెగా 157 అనౌన్స్మెంట్ రావడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు. 156ని వదిలిపెట్టి 157ని ఎందుకు ముందు స్టార్ట్ చేస్తున్నారనే విషయం మాత్రం అర్థం కాలేదు. తాజాగా దీనికి కారణం ఇదే అంటున్నారు.
Mega 156: మెగాస్టార్ చిరంజీవి కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది భోళా శంకర్. వేదాళం రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమాతో ఏ మాత్రం మెప్పించలేకపోయాడు దర్శకుడు మెహర్ రమేష్. దీంతో చిరు ఇక రీమేక్ సినిమాలు చేయకుంటే బెటర్ అని అంటున్నారు మెగాభిమానులు. చిరు కూడా రీమేక్ సినిమాలను పక్కకు పెట్టేసినట్టుగా మెగా 157 అనౌన్స్‌మెంట్‌తో చెప్పేశారు. బింబిసారతో బ్లాక్ బస్టర్ ఇచ్చిన మల్లిడి వశిష్టతో సోషియే ఫాంటసీ చేయబోతున్నారు మెగాస్టార్. ఈ సినిమా చిరు కెరీర్లో 157వ సినిమా కానుంది.
దీని కంటే ముందే 156 ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. చిరు కుమార్తె సుష్మిత నిర్మాణంలో కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమాకు ప్లాన్ జరుగుతోంది. అంతకంటే ముందే 157ని ప్రకటించారు. తాజాగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ అయింది. ఈ విషయాన్ని స్వయంగా వశిష్టనే సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. దీంతో 156 ఎప్పుడు? అనే డౌట్స్ వస్తున్నాయి. అలాగే 157నే ఎందుకు ముందు స్టార్ట్ చేస్తున్నారనే సందేహాలు కూడా ఉన్నాయి. దీనికి కారణం లేకపోలేదు.
మెగా 157 ప్రాజెక్ట్ సోషియో ఫాంటసీ సినిమా కావడంతో విఎఫ్ఎక్స్ వర్క్ కోసం చాలా సమయం పట్టనుంది. అలా చేయాలంటే.. వీలైనంత తర్వగా సినిమా మొదలు పెట్టాలి. అందుకే.. 156 కంటే ముందే మెగా 157 ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. జగదేకవీరుడు అతిలోక సుందరి, అంజి వంటి సోషియో ఫాంటసీ సినిమాల తర్వాత చిరు చేస్తున్న ఫాంటసీ ప్రాజెక్ట్ ఇదే. ఫస్ట్ సినిమా బింబిసారతో ఫాంటసీ టచ్ చేసి హిట్ కొట్టాడు వశిష్ట. దీంతో మెగా 157పై అనౌన్స్మెంట్ నుంచే అంచనాలు పెరిగిపోయాయి. మరి ఈ సోషియో ఫాంటసీ ఎలా ఉంటుందో చూడాలి.