Amigos Movie మల్లిడి వశిష్ట అనే కొత్త దర్శకుడిని ఇండస్డ్రీకి పరిచయం చేసి.. బింబిసారతో సాలిడ్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. దాంతో అమిగోస్ పై అంచనాలు గట్టిగా ఏర్పడ్డాయి. ఈ సినిమాతో రాజేంద్ర రెడ్డి అనే డైరెక్టర్ ఇంట్రడ్యూస్ అవుతుండడం..బింబిసార లాగే ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ రావడంతో.. అమిగోస్ పై భారీ హైప్ క్రియేట్ అయింది.
Amigos Movie మల్లిడి వశిష్ట అనే కొత్త దర్శకుడిని ఇండస్డ్రీకి పరిచయం చేసి.. బింబిసారతో సాలిడ్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. దాంతో అమిగోస్ పై అంచనాలు గట్టిగా ఏర్పడ్డాయి. ఈ సినిమాతో రాజేంద్ర రెడ్డి అనే డైరెక్టర్ ఇంట్రడ్యూస్ అవుతుండడం.. బింబిసార లాగే ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ రావడంతో.. అమిగోస్ పై భారీ హైప్ క్రియేట్ అయింది. ప్రమోషన్స్ కూడా భారీ ఎత్తున చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ కూడా వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి తర్వాత హ్యాట్రిక్ ఖాయమనుకున్నారు. కానీ అమిగోస్ రిలీజ్ అయి ఐదు రోజులైనా పెద్దగా సౌండ్ చేయడం లేదు. వీకెండ్‌లోను ఈ సినిమా సందడి లేదు. అసలు ఈ సినిమా థియేటర్లో ఉందా.. అనే డౌట్ రాక మానదు. మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న అమిగోస్.. రాను రాను డౌన్ అయినట్టే కనిపిస్తోంది. నాలుగు రోజుల్లో కలిపి రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.55 కోట్లు.. మొత్తం వరల్డ్ వైడ్‌గా 5.48 కోట్ల షేర్ రాబట్టినట్టు తెలుస్తోంది. ‘అమిగోస్’ చిత్రానికి వరల్డ్ వైడ్‌గా 11 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే 12 కోట్ల షేర్‌ను రాబట్టాల్సి ఉంది. కానీ వీకెండ్లోనే అమిగోస్ సత్తా చాటలేకపోయింది. సోమవారం నుంచి కలెక్షన్లు మరింతగా పడిపోయినట్టు తెలుస్తోంది. దాంతో బ్రేక్ ఈవెన్ కష్టమే అంటున్నారు. టార్గెట్ రీచ్ అవాలంటే ఇంకో ఏడు కోట్లకు పైగానే రాబట్టాల్సి ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది అసాధ్యంలానే కనిపిస్తోంది. పోనీ ఈ వీక్‌లో సినిమాలు లేవా అంటే.. సార్, వినరో భాగ్యము విష్ణుకథ రిలీజ్ అవుతున్నాయి. కాబట్టి అమిగోస్ పోయినట్టేనని ట్రేడ్ వర్గాల మాట. ఏదేమైనా సాలిడ్ బ్లాక్ బస్టర్ తర్వాత కళ్యాణ్ రామ్‌కు ఎదురదెబ్బ పడినట్టేనని చెప్పొచ్చు.