»We Will Donate Every Rupee From The Film To Janasena Nagababu
Konidela Nagababu : ఆ సినిమా ద్వారా వచ్చే ప్రతి రూపాయిని జనసేనకు విరాళంగా ఇస్తాం : నాగబాబు
సినీ నటుడు, నిర్మాత, జనసేన నాయకుడు కొణిదేల నాగబాబు (Konidela Nagababu) ముఖ్య ప్రకటన చేశారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జెనీలీయా జంటగా నటించిన మూవీ ఆరెంజ్.(Orange Movie) ఈ చిత్రాన్ని నాగబాబు నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ క్లాసికల్ ప్రేమ కథా చిత్రాన్ని రామ్ చరుణ్ బర్త్డే సందర్భంగా ఈ నెల 25, 26 తేదీల్లో మళ్లీ విడుదల చేస్తున్నామని నాగబాబు తెలిపారు. ఆ మూవీ ద్వారా వచ్చే ప్రతి రూపాయిని జనసేన పార్టీకి (Janasena party) విరాళంగా ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు.
సినీ నటుడు, నిర్మాత, జనసేన నాయకుడు కొణిదేల నాగబాబు (Konidela Nagababu) ముఖ్య ప్రకటన చేశారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జెనీలీయా జంటగా నటించిన మూవీ ఆరెంజ్.(Orange Movie) ఈ చిత్రాన్ని నాగబాబు నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ క్లాసికల్ ప్రేమ కథా చిత్రాన్ని రామ్ చరుణ్ బర్త్డే సందర్భంగా ఈ నెల 25, 26 తేదీల్లో మళ్లీ విడుదల చేస్తున్నామని నాగబాబు తెలిపారు. ఆ మూవీ ద్వారా వచ్చే ప్రతి రూపాయిని జనసేన పార్టీకి (Janasena party) విరాళంగా ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. మెగా అభిమానులు, జనసైనికులు మూవీ చూసి వినోదంతో పాటు జనసేనని బలోపేతం చేసే ఈ మంచి కార్యక్రమంలో పాల్గొనాలని ఆశిస్తున్నానని చెప్పారు. వినోదంతో పాటు జనసేనని బలోపేతం చేసే ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని ఆశిస్తున్నానని ఆయన తెలిపారు. ఆరెంజ్’ సినిమా 2010 నవంబర్ 26 న విడుదల అయింది. ఈ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ (Bommarillu Bhaskar) తెరకెక్కించారు.
ఒక్కరినే జీవితాంతం ప్రేమించలేం. మొదట్లో ఉన్న ప్రేమ చివరి వరకూ ఉండదు. అందుకే కొంచెం కొంచెం ప్రేమతో జీవితాంతం ప్రేమను పంచుదాం అనే సరికొత్త కాన్సెప్ట్ తో ఈ మూవీను రూపొందించారు భాస్కర్. ఈ సినిమాలో రామ్ చరణ్(Ram Charan) సరసన జెనీలియా నటించింది. ఈ మూవీలో రామ్ చరణ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. కమర్షియల్ గా ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయినా రామ్ చరణ్ అభిమానులకు మాత్రం ఈ మూవీ ఎంతో స్పెషల్. అందుకే ఈ సినిమాను రామ్ చరణ్ పుట్టిన రోజు (Ram Charan’s birthday) సందర్భంగా రీ రిలీజ్ (Re release)చేయాలని ఫ్యాన్స్ కోరారు. ఇక ఈ సినిమాలో పాటల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ ఏడాది మ్యూజికల్ హిట్ గా ఈ నిలిచాయి. ఇప్పటికీ ‘ఆరెంజ్’ పాటలు ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంటాయి.
ఆర్ఆర్ఆర్’ సినిమాతో రామ్ చరణ్ క్రేజ్ అంతర్జాతీయంగా పెరిగిపోయింది. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) వారసుడిగా ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టినప్పటికీ కెరీర్ మొదట్లో విమర్శలను కూడా ఎదుర్కొన్నారు రామ్ చరణ్. సినిమాలకు పనికిరాడని, చిరంజీవి కొడుకు అయితే హీరో అయిపోతాడా అని చాలా మంది కామెంట్లు కూడా చేశారు. అయినా అవన్నీ రామ్ చరణ్ ను ఆపలేకపోయాయి. ఎన్ని విమర్శలు వచ్చినా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయారు. కట్ చేస్తే ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు రామ్ చరణ్. ఆస్కార్ అవార్డుల (Oscar award) కార్యక్రమం కోసం అమెరికాలో(America) పర్యటించిన రామ్ చరణ్ ను ఎన్నో అంతర్జాతీయ మీడియా సంస్థలు ఇంటర్య్వూలు చేశాయి. ఇంటర్నేషనల్ అవార్డులను కూడా అందుకున్నారు. అంతే కాదు త్వరలో హాలీవుడ్ లో (Hollywood) కూడా చరణ్ ఎంట్రీ ఇవ్వనున్నారని సమాచారం. చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో(Directed by Shankar) ‘ఆర్ సి 15’ ‘(RC 15’)లో చేస్తున్నారు
చదవండి : 140 రోజుల్లో అత్యధికంగా కరోనా కేసులు..!
ఆరెంజ్ చిత్రాన్ని విడుదల చేసి, ఆ చిత్రం ద్వారా రాబోయే ప్రతి రూపాయి మన జనసేన పార్టీకి విరాళం ఇవ్వాలని నిర్ణయించాం. వినోదంతో పాటు జనసేనని బలోపేతం చేసే ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలి అని ఆశిస్తూ.. @NagaBabuOfflpic.twitter.com/QG4EW7ZSq3