»India Records 1300 New Covid Cases Highest In 140 Days
Covid Cases : 140 రోజుల్లో అత్యధికంగా కరోనా కేసులు..!
Covid Cases : దేశంలో కరోనా మళ్లీ విజృంభించడం మొదలుపెట్టింది. చాలా కాలం తర్వాత కరోనా కేసులు పెరగడం మొదలుపెట్టాయి. బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు కోవిడ్ కేసులు రికార్డు స్థాయిలో రిజిస్టర్ అయ్యాయి. గురువారం 1300 మందికి కరోనా సోకినట్లు నిర్థారణ అవ్వగా.. ముగ్గురు మరణించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
దేశంలో కరోనా మళ్లీ విజృంభించడం మొదలుపెట్టింది. చాలా కాలం తర్వాత కరోనా కేసులు పెరగడం మొదలుపెట్టాయి. బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు కోవిడ్ కేసులు రికార్డు స్థాయిలో రిజిస్టర్ అయ్యాయి. గురువారం 1300 మందికి కరోనా సోకినట్లు నిర్థారణ అవ్వగా.. ముగ్గురు మరణించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. బుధవారం ఒక్కరోజే మహమ్మారి నుంచి 718 మంది కోలుకున్నారని, రికవరీ రేటు 98.79 శాతంగా ఉందని తెలిపింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 0.02 శాతంగా ఉన్నాయని ఆరోగ్యశాఖ తెలిపింది.
ఈ కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో.. ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమావేశం కూడా నిర్వహించారు. ఈ సమావేశంలో కరోనా వ్యాప్తి నివారణకు అందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఆస్పత్రుల్లో డాక్టర్లు, పేషెంట్స్, ఇతర సిబ్బంది మాస్క్ ధరించడంతో పాటు పలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రతీ ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతను పాటించాలని ఆయన సలహా ఇచ్చారు. కరోనా కట్టడి కోసం తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత శాఖల అధికారులకు మోదీ దిశానిర్దేశం చేశారు.