BDK: సింగరేణి సంస్థ ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్ నుంచి తమిళనాడు పవర్ జనరేషన్ కార్పోరేషన్‌కు బొగ్గును సరఫరా చేసేందుకు సర్వం సిద్ధమైంది. ఈ బ్లాక్ నుంచి ఏటా 2.88 మిలియన్ టన్నుల బొగ్గు సరఫరాకు జెన్-కో తో సింగరేణి సంస్థ మరో 10 రోజుల్లో ఇంధన సరఫరా ఒప్పందం చేసుకోనుంది. ఈ నేపథ్యం లో కార్పొరేషన్ ఎండీ గోవిందరావు సీఎండీ బలరాం కలిసి నేడు చర్చించారు.