ఇప్పటికే వారసుడు, వీరసింహారెడ్డి రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేశారు. ఈ రెండు సినిమాలు జనవరి 12న బాక్సాఫీస్ దగ్గర తలపడేందుకు సై అంటున్నాయి. దాంతో అందరి దృష్టి ‘వాల్తేరు వీరయ్య’ రిలీజ్ డేట్ పైనే ఉంది. ఇప్పటికే బాలయ్య ముందా.. చిరు ముందా అనే చర్చ జోరుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ‘వాల్తేరు వీరయ్య’ ఎట్టకేలకు రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మైత్రీ మూవీ మేకర్స్. అనుకున్నట్టే బాలయ్య తర్వాతే మెగాస్టార్ బాక్సాఫీస్ బరిలోకి దిగబోతున్నాడు. జనవరి 13న ‘వాల్తేరు వీరయ్య’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. రిలీజ్ డేట్ ప్రకటిస్తూ.. రిలీజ్ చేసిన వీరయ్య మాసివ్ పోస్టర్ అదరహో అనేలా ఉంది. సముద్రం మధ్యలో బోట్ పై వస్తున్న చిరు వింటేజ్ లుక్ చూసి మురిసిపోతున్నారు మెగాభిమానులు. ఇక వీరయ్య ఎంట్రీ ఫిక్స్ అయిపోయింది కాబట్టి.. నెక్ట్స్ మాస్ మహారాజా రవితేజ టైం స్టార్ట్ అంటున్నారు. బాబీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే ఇప్పటి వరకు మాస్ రాజాకు సంబంధించిన లుక్ రివీల్ చేయలేదు. అలాగే ప్రమోషన్స్ పరంగా వీరయ్య కాస్త వెనకబడిపోయాడు. దాంతో స్పీడ్ పెంచడానికి రెడీ అయింది చిత్ర యూనిట్. ప్రమోషన్స్‌తో పాటు.. ‘వాల్తేరు వీరయ్య’ నుంచి రవితేజ టీజర్‌ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ 9న రవితేజ పాత్రకి సంబంధించిన టీజర్‌ని రిలీజ్ చేయనున్నారట. ఇప్పటికే టీజర్ కట్ చేశారని.. చిరు, రవితేజల మధ్య వచ్చే సీన్స్ అదిరిపోయాయని టాక్. ఇక అక్కడి నుంచి ప్రమోషన్స్ పరుగులు పెట్టించాలని చూస్తోందట చిత్ర యూనిట్. ఏదేమైనా ‘వాల్తేరు వీరయ్య’ మాసివ్ ట్రీట్ ఇవ్వడం ఖాయమంటున్నారు.