Vyooham teaser: రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) తన ‘వ్యూహం’ మూవీ టీజర్ రిలీజ్ చేశారు. వైఎస్ఆర్ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడంతో టీజర్ మొదలవుతోంది. జగన్ పాత్ర, చంద్రబాబు నాయుడు రోల్, రోశయ్య, కాంగ్రెస్ హైకమాండ్, సీబీఐ విచారణ, జైలు నుంచి బయటకు రావడం, వైఎస్ఆర్ మరణవార్త విని ఓదార్పు యాత్ర చేపట్టడం టీజర్లో చూపించారు. వైఎస్ఆర్ మరణం తర్వాత జగన్ రాజకీయ తెరంగ్రేటానికి సంబంధించిన ఘట్టాలను టీజర్లో చూపించారు.
వైఎస్ఆర్ హెలికాప్టర్ పావురాల గుట్ట మీద కనిపించే సీన్‌తో టీజర్ స్టార్ట్ అవుతోంది. ఓ కాంగ్రెస్ నేత పరుగుత్తు కుంటూ జగన్ వద్దకు వస్తారు. విషయం చెప్పగా.. జగన్‌లో దు:ఖం కనిపిస్తోంది. అప్పటి విపక్ష నేత చంద్రబాబు మొహంలో మాత్రం నవ్వును చూపించారు. ఆ వెంటనే కాంగ్రెస్ పార్టీలో వేగంగా పరిణామాలు.. రోశయ్య రావడం, హై కమాండ్ ప్రతినిధి ఒకరు కనిపిస్తారు. సీఎం పోస్ట్ కోసం జగన్ పట్టుబట్టిన సంగతి తెలిసిందే. దాంతో సీబీఐ, ఈడీ కేసులతో 16 నెలలు జైలుకు వెళతారు. జైలు నుంచి బయటకు వచ్చే సన్నివేశాలను చూపిస్తారు.
వైఎస్ఆర్ చనిపోయారని తెలిసి చాలా మంది చనిపోతారు. వారిని పరామర్శించేందుకు జగన్ ఓదార్పు యాత్ర చేపడుతారు. అలా జనంలో కలుసుకుంటారు. జగన్- భారతీ మధ్య సీన్స్, చివరికీ అలా ఆలోచించడానికి తాను చంద్రబాబును కాదు అని ఒక డైలాగ్ మాత్రం టీజర్లో ఉంటుంది.
వ్యుహం మూవీలో జగన్ పాత్రను అజ్మల్ అమీర్ (ameer) పోషిస్తున్నారు. అతని భార్య పాత్రను మానస రాధాకృష్ణన్ (manasa radhakrishnan) నటిస్తున్నారు. మూవీ బయోపిక్ కాదని.. అంతకుమించి, రియల్ పిక్ అని గతంలోనే వర్మ ప్రకటించారు. ఇందులో అన్నీ నిజాలే ఉంటాయని పేర్కొన్నారు. మూవీ రెండు భాగాలుగా రానుంది. ఫస్ట్ పార్ట్ పేరు వ్యుహం (Vyooham) కాగా.. రెండో భాగం పేరు శపథం అని రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ప్రకటించారు. అప్పట్లో సీఎం జగన్‌ను (jagan) కలిసిన వెంటనే మూవీ గురించి వర్మ ప్రకటించడంతో హైప్ వచ్చింది.