Vishwak Sen కెరీర్ బెస్ట్.. ‘ధమ్కీ’ భారీ ఓపెనింగ్స్!
Vishwak Sen : అశోక వనంలో అర్జున కళ్యాణం, ఓరి దేవుడా చిత్రాలతో మంచి విజయాలను అందుకున్నాడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్. అందుకే ఈసారి పాన్ ఇండియా లెవల్లో ధమ్కీ ఇచ్చేశాడు విశ్వక్. రిలీజ్‌కు ముందే 'దాస్ కా ధమ్కీ' సినిమా పై మంచి బజ్ క్రియేట్ చేశాడు.
అశోక వనంలో అర్జున కళ్యాణం, ఓరి దేవుడా చిత్రాలతో మంచి విజయాలను అందుకున్నాడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్. అందుకే ఈసారి పాన్ ఇండియా లెవల్లో ధమ్కీ ఇచ్చేశాడు విశ్వక్. రిలీజ్‌కు ముందే ‘దాస్ కా ధమ్కీ’ సినిమా పై మంచి బజ్ క్రియేట్ చేశాడు. తనే హీరోగా నటిస్తు.. రెండోసారి దాస్ కా ధమ్కీతో మెగాఫోన్ పట్టాడు. ఉగాది సందర్భంగా మార్చి 22న సినిమా ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఇక ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. దాంతో భారీ ఓపెన్సింగ్స్ రావడం పక్కా అని అంచనా వేశాయి ట్రేడ్ వర్గాలు. అనుకున్నట్టే ఫస్ట్ డే ధమ్కీ ఇచ్చి పడేశాడు విశ్వక్. కేరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్నాడు. మొదటి రోజు వరల్డ్ వైడ్‌గా 8.88 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో ఇప్పటి వరకు.. విశ్వక్ సేన్ కెరీర్లో ఫస్ట్ డే హెయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా ‘దాస్ కా ధమ్కీ’ నిలిచిందని చెప్పొచ్చు. మరోవైపు ఓవర్సీస్‌లోను ఈ సినిమా దూసుకుపోతోంది. అక్కడ కూడా మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ రావడానికి ఎన్టీఆర్, బాలయ్య ప్రమోషన్స్ గట్టిగానే కలిసొచ్చింది. ఈ సినిమాలో విశ్వక్ డ్యూయెల్లో ఇరగదీశాడనే టాక్ నడుస్తోంది. నెగెటివ్ టచ్‌తో సీక్వెల్ అనౌన్స్మెంట్ అదిరిపోయిందని అంటున్నారు. వన్మయే క్రియేషన్స్ పై విశ్వక్ సేన్ తండ్రి కరాటే రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. మొత్తానికి ఈ సినిమా మున్ముందు మరింతగా కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది. ఈ సినిమాలో నివేదా పేతురాజ్ గ్లామర్, లియోన్ జేమ్స్ మ్యూజిక్ హైలెట్‌గా నిలిచిందని అంటున్నారు.